Don't Miss!
- News నామినేషన్ల పర్వంలో టీడీపీకి ఊహించని షాక్
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
పవర్ ఫుల్‌గా OLX బామ్మ.. అన్నపూర్ణమ్మ పాత్ర ఏంటంటే..
ఎవరెస్టు ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఎం ఎన్ ఆర్ చౌదరి నిర్మిస్తున్న చిత్రం 'అన్నపూర్ణమ్మ గారి మనవడు' సీనియర్ మోస్ట్ నటీమణి అన్నపూర్ణమ్మ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో మాస్టర్ రవితేజ టైటిల్ రోల్ ప్లే చేస్తున్నారు. నర్రా శివనాగేశ్వర్ రావు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను అమరావతి పరిసర ప్రాంతంలో ఉన్న అందమైన ఓ గ్రామంలో షూటింగ్ ను జరుపుకొంటుంది.
ఈ సందర్బంగా నిర్మాత చిత్ర విశేషాలను పంచుకుంటూ ఓ పల్లెటూరిలో ఎవరికీ ఏం జరిగినా రచ్చబండ పంచాయతీ దర్బార్ లో పెద్ద దిక్కైన అక్కినేని అన్నపూర్ణమ్మ అనే పవర్ ఫుల్ పాత్రలో నటీమణి అన్నపూర్ణ కనిపిస్తున్నారు. ఆ పల్లెటూరిలోనే ఆమెకు ధీటుగా ఎదురెళ్లే వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడుగా సీనియర్ నటుడు బెనర్జీ నటిస్తున్నారు.
ఇక షూటింగ్ సెట్ విషయానికి వస్తే.. ఆ ఊరిలోనే పంచాయతీ దర్బార్ సెట్ అందరినీ ఆకర్షింపచేస్తుంది. అంతేకాకుండా పంచాయతీ సన్నివేశాలకు గానూ రెండు వందలమంది జూనియర్ ఆర్టిస్టులతో ఆసక్తికరంగా తెరకెక్కించారు దర్శకుడు.
ప్రస్తుతం మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో అర్చన హీరోయిన్ గా నటిస్తుండగా జీవ, రఘు బాబు , కాటమంచి రఘు, తాగుబోతు రమేష్, సుమన్ శెట్టి, శ్రీ హర్ష, అదుర్స్ సాయి, రమాప్రభ, శ్రీలక్ష్మి, ప్రభ, జయ వాణి తదితరులు నటిస్తున్నారని నిర్మాత ఎం ఎన్ ఆర్ చౌదరి చెప్పుకొచ్చారు.