ప్రభాస్ కోసం మరో హై రేంజ్ బడ్జెట్.. సెట్స్‌కే రూ.30 కోట్లు..
బాహుబలి తర్వాత ప్రభాస్ సినిమా రిలీజ్‌కు నోచుకోక రెండేళ్లు కావొస్తుంది. సాహో చిత్ర షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో యంగ్ రెబల్ స్టార్ బిజీగా ఉన్నారు. ఓ వైపు సాహోను ఆగస్టులో రిలీజ్ చేయడానికి ప్రయత్సిస్తూనే మరో వైపు రాధాకృష్ణ మూవీని పట్టాలెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రభాస్ సొంత నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్నది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నది.
స్క్రిప్టు డిమాండ్ మేరకు ఈ చిత్రాన్ని విదేశాల్లో చిత్రీకరించాల్సిన అవసరం ఉంది. కానీ పలుమార్లు విదేశాలకు వెళ్లిరావడం చాలా కష్టమైన పనే కాకుండా.. వ్యయంతో కూడినదని భావించారు. అందుచేత హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ సెట్లను నిర్మించాలని నిర్ణయించినట్టు తెలుస్తున్నది. ఈ మేరకు స్థల అన్వేషణ జరిగినట్టు సమాచారం.
విదేశీ వాతావరణం ప్రతిబింబించేలా సెట్స్ వేయడానికి భారీగా బడ్జెట్‌ను ఏర్పాటు చేసినట్టు సమాచారం. ఇందుకోసం ఏకంగా రూ.30 కోట్లతో సెట్లు వేయాలని ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభమయ్యాయని తెలుస్తున్నది. సినిమా బడ్జెట్ కూడా హై రేంజ్‌లో ఉంటుదని స్పష్టమవుతున్నది.

బాహుబలి నుంచి సాహో వరకు రెండు భారీ బడ్జెట్ చిత్రాలే. సాహో చిత్రాన్ని సుమారు రూ.400 కోట్లతో రూపొందించిన సంగతి తెలిసిందే. కేవలం దుబాయ్‌లో యాక్షన్ సీన్లకే రూ.50 కోట్లు ఖర్చు చేసినట్టు వార్తలు వచ్చాయి. తాజాగా రాధాకృష్ణ రూపొందించే చిత్రం కోసం భారీగా ఖర్చు చేయడానికి ఏర్పాట్లు చేస్తుండటంతో నిర్మాతలు ప్రభాస్‌పై ఎంతైనా సరే ఖర్చుకు వెనుకాడకుండా ముందుకు వస్తున్నట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











