సమంతకు షాకిచ్చిన అమెజాన్.. సిటాడెల్ కంటే ముందుగానే!

తెలుగు సినిమా దగ్గర మాత్రమే కాకుండా టోటల్ పాన్ ఇండియా లెవెల్ సినిమా దగ్గర కూడా మంచి ఫేమ్ అండ్ మార్కెట్ ఉన్నటువంటి టాప్ మోస్ట్ హీరోయిన్స్ లో హాట్ బ్యూటీ సమంత కూడా ఒకామె. మరి సామ్ ఇప్పుడు కెరీర్ పరంగా కొంచెం గ్యాప్ తీసుకొని మళ్ళీ షూటింగ్స్ లోకి అడుగు పెట్టింది. అలాగే తన మాజీ భర్త నాగ చైతన్య అక్కినేని రెండో పెళ్లి అనౌన్సమెంట్ తర్వాత అయితే వార్తల్లో మరింత ఎక్కువగా సమంత పేరు వైరల్ గా మారింది.

మరి దీనిపై సమంత ఎలాంటి స్పందన అందించకపోయినప్పటికీ ఆమె పేరు చక్కర్లు కొట్టడం మాత్రం జరిగింది. ఇక ఇదిలా ఉంటే సమంత నుంచి ఈ ఏడాది ఎలాంటి సినిమాలు లేవు కానీ ఒక్క వెబ్ సిరీస్ మాత్రం ఓటిటిలో రాబోతుంది. అదే తన అవైటెడ్ స్పై థ్రిల్లర్ అండ్ యాక్షన్ సిరీస్ "సిటాడెల్ హనీ బన్నీ". బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ తో తన కాంట్రవర్సియల్ వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ 2 దర్శకులు రాజ్ అండ్ డీకే లతో చేసిన ఈ వెబ్ సిరీస్పై మంచి అంచనాలు ఉన్నాయి.

another citadel series coming before samantha one total 3 same series in single ott

అయితే ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ కూడా ఈ మధ్య రిలీజ్ చేయగా అది మంచి బజ్ ని రేకెత్తించింది. సరే ఇది బాగానే ఉంది కానీ ఈ వెబ్ సిరీస్ ఆల్రెడీ హాలీవుడ్ లో చేసిన "సిటాడెల్" అనే సిరీస్ కి రీమేక్ గా ఇండియన్ వెర్షన్ లో తెరకెక్కించారు. అది కూడా సామ్ సిటాడెల్ ఉన్న అమెజాన్ ప్రైమ్ వీడియో లోనే ఉంది. ఇంతేనా ఆ సిరీస్ తెలుగులో కూడా అందుబాటులో ఉంది.

ఇప్పుడు సామ్ సిరీస్ కూడా తెలుగులో నవంబర్ నుంచి స్ట్రీమింగ్ కి వచ్చేందుకు ఆల్రెడీ ఫిక్స్ అయ్యింది. కానీ ఇక్కడ మరో ట్విస్ట్ ఏమిటంటే సమంత సిటాడెల్ కంటే ముందే మరో సిటాడెల్ సిరీస్ ఇదే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అనౌన్స్ కావడం గమనార్హం. అది కూడా సమంత సిటాడెల్ కంటే ఓ నెల ముందే స్ట్రీమింగ్ కి అది కూడా తెలుగులో కూడా అందుబాటులోకి వస్తుంది అని అమెజాన్ ప్రైమ్ వీడియో వారు ఇటీవల అనౌన్స్ చేశారు.

another citadel series coming before samantha one total 3 same series in single ott

కాగా ఈ సిటాడెల్ ఇటాలియన్ వెబ్ సిరీస్ అట. ఇది "సిటాడెల్ డయానా" అనే పేరుతో స్ట్రీమింగ్ కి రాబోతున్నట్టుగా ప్రైమ్ వీడియో కన్ఫర్మ్ చేశారు. అయితే ఇది కూడా ప్రియాంక చోప్రా సిటాడెల్ కి రీమేక్ అన్నట్టు తెలుస్తుంది. ఇది అక్టోబర్ 10 నుంచి తెలుగు సహా అన్ని ముఖ్య భాషల్లో స్ట్రీమింగ్ కి రాబోతుంది. ఇలా ఒకే వెబ్ సిరీస్ మూడు వెర్షన్స్ లో ఒకే స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ లో రావడం అనేది ఇంట్రెస్టింగ్ అంశం అని చెప్పాలి. ఈ సిరీస్ తర్వాత నవంబర్ లో సమంత నటించిన సిటాడెల్ స్ట్రీమింగ్ కానుంది. ఇలా మొత్తం మూడూ ఒకే ఓటిటిలో దర్శనం ఇవ్వనున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X