ప్రభాస్ అభిమానులకు మరో గుడ్ న్యూస్.. రాధేశ్యామ్ నుంచి మరో సర్‌ప్రైజ్

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో రాధేశ్యామ్ కూడా టాప్ లిస్టులో ఉంది. రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదీన గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఇక సినిమాకు సంబంధించిన రెగ్యులర్ ప్రమోషన్ ను కూడా స్టార్ట్ చేశారు. సినిమాపై ఓ వర్గం ప్రేక్షకులపై అయితే అంచనాలు భారీగానే ఉన్నాయి. తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంది అని ఇదివరకే ఒక క్లారిటీ అయితే వచ్చేసింది.

ప్రస్తుతం ఈ సినిమా పై పెరుగుతున్న అంచనాలు అయితే మామూలుగా లేవు. ఇక కేవలం ప్రభాస్ ఉన్నాడు అనే ఒకే ఒక్క అంశం తో సినిమాకు మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడింది. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ సాహో సినిమాతో అయితే అనుకున్నంత స్థాయిలో గుర్తింపు అందుకోలేదు. ఇక ఎలాగైనా మరో మంచి లవ్ స్టోరీ సినిమా తో ప్రేక్షకులకు సరికొత్త అలరించాలని అనుకున్నాడు. అందుకే రాధేశ్యామ్ కథను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ సినిమా దాదాపు సాహో సినిమా తో పాటు మొదలైనప్పటికీ మధ్యలో అనుకోని కారణాల వలన వాయిదా పడుతూ వచ్చింది. ఇక సంక్రాంతికి భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. ఇక సినిమాకు సంబంధించిన పాటలను కూడా ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నారు.

Another good news for prabhas fans radheshyam latest update

ఇక చాలా రోజుల తర్వాత ప్రభాస్ అభిమానులకు మంచి కిక్ ఇచ్చే విధంగా మరొక సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. సంచారి అనే పాటకు సంబంధించిన టీజర్ ను మధ్యాహ్నం ఒకటి గంటలకు విడుదల చేయబోతున్నారు. ఇప్పటివరకు ప్రభాస్ పూజా హెగ్డే కు సంబంధించిన లవ్ సాంగ్స్ ను మాత్రమే విడుదల చేశారు. ఇక ఇప్పుడు ప్రభాస్ క్యారెక్టర్ హైలెట్ చేసే విధంగా సంచారి అనే పాటను విడుదల చేయబోతున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అంశంలో కూడా చిత్ర యూనిట్ చాలా విభిన్నంగా ఆలోచిస్తుంది. తెలుగులో అలాగే హిందీలో సంబంధం లేకుండా విభిన్నమైన మ్యూజిక్ అందిస్తున్నారు. అంతే కాకుండా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా అదే విధంగా ఆలోచిస్తున్నారు. ఎవరి టేస్ట్ కు తగ్గట్టుగా వారికి సినిమాను అందించాలి అని చిత్ర యూనిట్ సభ్యులు ఆలోచిస్తున్నారు.

ఇక సినిమాను యు.వి.క్రియేషన్స్ తో పాటు గోపి కృష్ణ బ్యానర్ పై సంయుక్తంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. రెండు వందల కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో తెరపైకి తీసుకు రాబోతున్న ఈ సినిమాను తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందని నమ్మకంతో ఉన్నారు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన అన్ని పనులను పూర్తి చేసుకున్నారు. ప్రభాస్ కలిసి త్వరలోనే రెగ్యులర్ ప్రమోషన్స్ లో కూడా పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దర్శకుడు రాధాకృష్ణ రెగ్యులర్ ఇంటర్వ్యూలతో బిజీగా మారాడు. ఇక నార్త్ లో కూడా త్వరలోనే సినిమాను ప్రమోట్ చేయడానికి వెళ్లబోతున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X