Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
మహేష్ - రాజమౌళి బిగ్ బడ్జెట్ మూవీ.. ఆ పనులన్నీ తండ్రి చేతుల్లోనే..
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న బిగ్ బడ్జెట్ మూవీ పాన్ ఇండియా కోసం అభిమానులు ఏ స్థాయిలో ఎదురు చేస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇండియన్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ గా రానున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రతి గాసిప్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక రాజమౌళి భవిష్యత్తులో మరో మల్టీస్టారర్ కూడా చేస్తాడని టాక్ అయితే గట్టిగానే వస్తోంది. మహేష్ బాబుతో ఇప్పటికే ఒక సినిమాకు కమిట్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే.
భారీ స్థాయిలో బిజినెస్
RRR సినిమా మొదటి రోజే ఈజీగా వందకోట్లను రాబట్టగలదని అందరికి ఒక క్లారిటీ వచ్చేసింది. సినిమాను ఇదే ఏడాది అక్టోబర్ 13న గ్రాండ్ గా విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే. అయితే సినిమాకు సంబంధించిన బిజినెస్ డీల్స్ కూడా చాలా వరకు క్లోజ్ అవుతున్నాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రధాన ఏరియాల్లో భారీ ధరకు సినిమా అమ్ముడైనట్లు సమాచారం.
స్పై థ్రిల్లర్ అంటూ..
జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ లాంటి అగ్ర హీరోల అనంతరం రాజమౌళి చేయబోయే సినిమాపై కూడా అంచనాలు అమాంతంగా పెరిగిపోతాయని చెప్పవచ్చు. మహేష్ బాబు లాంటి స్టార్ హీరోను ఇప్పటివరకు జక్కన్న దర్శకత్వంలో చూడలేదు. మొదటి నుంచి కూడా ఈ కాంబోపై అనేక రకాల రూమర్స్ అయితే వస్తున్నాయి. స్పై థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కున్నట్లు అప్పట్లో ఒక టాక్ వచ్చిన విషయం తెలిసిందే.
ఆ తమిళ్ హీరో ఎవరో..?
పాన్ ఇండియా ప్రాజెక్ట్ కాబట్టి అన్ని భాషల్లో సినిమా సక్సెస్ కావాలి. అందుకు రాజమౌళి క్రేజ్ మాత్రమే సరిపోదు. మిగతా భాషల్లో లోకల్ ఆడియెన్స్ ను ఎట్రాక్ట్ చేసే విధంగా అక్కడి స్టార్స్ ను కూడా సినిమాలో వాడుకోవల్సి ఉంటుంది. అందుకే మహేష్ సినిమాలో తమిళ్ నుంచి స్టార్స్ ను వెతుకుతున్నట్లు సమాచారం. త్వరలోనే ఒక యువ హీరో కోసం సెర్చింగ్ మొదలు స్టార్ట్ కానుందట.
ఏదైనా RRR తరువాతే..
అలాగే బాలీవుడ్ సైడ్ కూడా అగ్ర నగినటులను కొన్ని క్యారెక్టర్స్ కోసం సెలెక్ట్ చేసుకునే ఆలోచనలో ఉన్నారట. ముందుగా ఈ బాధ్యతను తండ్రి విజయేంద్ర ప్రసాద్ కు అప్పగించినట్లు టాక్. ప్రస్తుతం RRR సినిమాతో బిజీగా ఉండడం వలన మహేష్జ్ సినిమాపై ఇంకా పూర్తిగా ఫోకస్ అయితే పెట్టలేదట. తండ్రి విజయేంద్రప్రసాద్ ఒక లిస్ట్ రెడీ చేసిన అనంతరం అది ఎంతవరకు కరెక్ట్ అనే దానిపై తరువాత రాజమౌళి ఫోకస్ చేయనున్నట్లు సమాచారం.