Nithiin32: తెలుగులోకి మరో కొత్త విలన్.. నితిన్‌కు ధీటుగా మలయాళీ నటుడు!
ఇతర చిత్ర పరిశ్రమల నుంచి నటులను తెలుగు సీమలోకి రావడం సర్వ సాధారణమే. అలా ఇప్పటికీ ఎంతోమంది నటులు తెలుగు చిత్రాల్లో ప్రత్యేక పాత్రల్లో నటించి ప్రేక్షకుల అభిమానం పొందారు. ఇటీవల కాలంలో అయితే ఎక్కవగా మలాయళీ నటులు తెలుగు తెరపై కనువిందు చేస్తున్నారు. పుష్ప సినిమాలో ఫహాద్ ఫాజిల్ నుంచి నిన్నటి దసరాలో షైన్ టామ్ చాకో వరకు చాలా మంది మాలీవుడ్ నటులు అలరించారు. ఇప్పుడు వీరి జాబితాలోకి మరో యాక్టర్ చేరనున్నాడు.
సాలిడ్ కమ్ బ్యాక్: జయం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయం అయ్యాడు నితిన్. మొదటి సినిమాతోనే మంచి హిట్ కొట్టిన ఈ హీరో దిల్ మూవీతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాడు. తర్వాత వరుసగా చేసిన 14 చిత్రాల్లో సై ఒక్కటి తప్పా మిగతా 13 సినిమాలు అన్ని బాక్సాఫీస్ వద్ద ఓటమి అందుకున్నాయి. అయినా వెనక్కి తగ్గని నితిన్ ఇష్క్ సినిమాతో సాలిడ్ కమ్ బ్యాక్ హిట్ కొట్టాడు.

డిజాస్టర్ టాక్: ఇష్క్ సినిమాతో యూత్ లో మరింత్ క్రేజ్ ఏర్పర్చుకున్నాడు నితిన్. తర్వాత గుండే జారి గల్లంతయిందే సినిమాతో మరో సక్సెస్ అందున్న నితిన్ కెరీర్ యావరేజ్ గా రన్ అయింది. మళ్లీ భీష్మ మూవీతో మంచి విజయం సాధించిన నితిన్ గతేదాడి మాచర్ల నియోజకవర్గం సినిమాతో ఘోరంగా విఫలమయ్యాడు. రాజ శేఖర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.

ఏడాది పూర్తి: ఇప్పుడు కొత్త సినిమాతో మంచి సక్సెస్ కొట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు నితిన్. నితిన్ 32వ (Nithiin32) చిత్రం వస్తున్నదానికి రచయిత, దర్శకుడు వక్కంత వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా తర్వాత వక్కంతం వంశీ డైరెక్షన్ చేస్తున్న రెండో సినిమా ఇది. అయితే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయి ఏడాది కావొస్తుంది. కానీ ఇప్పటి వరకు విలన్ ను ఎంపిక చేయలేదు.

కీలక పాత్రలు:తాజాగా నితిన్ 32వ చిత్రంలో ప్రతినాయకుడిగా ఎవరు నటించనున్నారో క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఇందులో నితిన్ కు ధీటుగా పవర్ ఫుల్ విలన్ గా మలయాళ నటుడు సుదేవ్ నాయర్ (Sudev Nair)ను మేకర్స్ ఎంపిక చేశారు. మిలియన్ డాలర్ ఆర్మ్, మై లైఫ్ పార్టనర్, ఇండియాస్ మోస్ట్ వాంటెడ్, భీష్మ పర్వం, సీబీఐ 5: ది బ్రెయిన్ వంటి సినిమాల్లో సుదేవ్ కీలక పాత్రలు పోషించాడు.
హరీస్ జయరాజ్ మ్యూజిక్: హిందీ, తమిళం, మలాయళం చిత్రాలేకాకుండా ఇంగ్లీషులో నటించిన సుదేవ్ నాయర్ డబ్బింగ్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉండొచ్చు. కానీ నేరుగా ఆయన చేస్తున్న మాత్రం ఇదే. ఈ యాక్షన్ సినిమాలో నితిన్ కు జోడీగా శ్రీలీల నటించనుంది. ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్టైన్ మెంట్స్ తో కలిసి శ్రేష్ట్ మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమాకు హరీస్ జయరాజ్ సంగీతం అందిస్తున్నారు.

దసరా తరహాలోనే:ఇక ఇటీవల నాని దసరా సినిమాలో షైన్ టామ్ చాకోకు నటుడిగా ఎంత పేరు వచ్చిందో తెలిసిందే. ఇప్పుడు నితిన్ సినిమాలో కూడా దసరా తరహాలోనే మలయాళ నటుడు సుదేవ్ నాయర్ ను దించేందుకు స్కెచ్ వేశారు మేకర్స్. మరి చూడాలి ఈ నటుడు ఎంతవరకు గుర్తింపు సాధిస్తాడనేది.


Click it and Unblock the Notifications











