twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అల్లు ఫ్యామిలీ నుంచి మరో సినీ హీరో ఎంటరవుతున్నాడు!

    |

    అల్లు ఫ్యామిలీ నుంచి ఇప్పటికే అల్లు అర్జున్, అల్లు శిరీష్ ఇండస్ట్రీలో హీరోగాలు కొనసాగుతున్నారు. త్వరలో వీరి ఫ్యామిలీ నుంచి మరో స్టార్ రాబోతున్నాడట. నిర్మాత అల్లు అరవింద్‌కు బంధువైన విరాన్ ముత్తంశెట్టి వెండి తెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నాడు. పి.సి.ఎం. స్టూడియో, మైత్రి అసోసియేషన్ పతాకాలపై చిట్టిశర్మ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందబోతోంది. సి.హెచ్.వి.యస్.ఎన్. బాబ్జి నిర్మాత.

    దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం దేవుడు అవతారం ఎత్తుతాడనేది గీతా సారాంశం. కానీ ధర్మం నశించి...ఆ దేవుడి ఉనికే ప్రశ్నగా మారిన ఇప్పటి లోకానికి ఆ దేవుడిని పరిచయం చేసిన ఓ యువకుడి కథే ఈ చిత్రమని నిర్మాత సి.హెచ్.వి.యస్.ఎన్. బాబ్జి తెలిపారు.

    Another star entry from Allu family

    తెలుగు, తమిళ, మలయాళ భాషలలో ఈ చిత్రాన్ని రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. డివోషనల్ థ్రిల్లర్‌గా ప్రేక్షకులను అలరించబోతున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జూన్ మొదటివారం నుంచి ప్రారంభం కానుంది. తిరుపతి, పశ్చిమ గోదావరి, రంపచోడవరం, కేరళ, తమిళనాడు పరిసర ప్రాంతాలలో షూటింగ్ జరిపేందుకు షెడ్యూల్ సిద్ధం చేశారు.

    Another star entry from Allu family

    కేరళలోని అనంత పద్మనాభస్వామి దేవాలయం చరిత్ర నేపథ్యంలో గ్రాఫిక్స్ ప్రధానంగా సాగే ఈ చిత్రంలోని ఇతర నటీనటు వివరాలను త్వరలో వెల్లడిస్తామని నిర్మాతలు తెలిపారు. ఉగాది సందర్భంగా మ్యూజిక్ సిట్టింక్స్ మొదలు కానున్నాయి. ఈ చిత్రానికి సంగీతం-జీబు, కెమెరా-సూర్యప్రకాష్, ఎడిటింగ్-ఆవుల వెంకటేష్, ఆర్ట్-జి.బాబ్జి, సహ నిర్మాత-ఇ.ధర్మప్రసాద్, నిర్మాత-సి.హెచ్.వి.యస్.ఎన్.బాబ్జి, కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం-చిట్టిశర్మ.

    English summary
    Allu Aravind relative Viran Muttham Shetty planning to enter to Film Industry. The film starts soon, directed by Chitti Sharma, Produced by Babji.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X