‘సాహో’ టీమ్ నుంచి మరో సర్‌ప్రైజ్.. మీరే ప్రభాస్ అయిపోవచ్చు.!
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి'తో యూనివర్సల్ స్టార్ అయిపోయాడు టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్. భారతదేశ సినీ చరిత్రలో రికార్డులు క్రియేట్ చేసిన ప్రాజెక్ట్ తర్వాత అతడు నటించిన చిత్రం 'సాహో'. దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్, హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను 'రన్ రాజా రన్' ఫేం సుజిత్ తెరకెక్కిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ నటిస్తోంది. ఈ సినిమా నాలుగు భాషల్లో విడుదల కాబోతుంది.
ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, పోస్టర్స్, టీజర్, సాంగ్స్ అన్నింటికీ భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. ఇక, ఇటీవల వచ్చిన యాక్షన్ పోస్టర్‌ను చూసిన తర్వాత ప్రభాస్ అభిమానులే కాదు.. సామాన్య ప్రేక్షకులు సైతం సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఎదురు చూస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇలాంటి తరణంలో మరో సర్‌ప్రైట్ ఇచ్చింది 'సాహో' టీమ్.

అదే.. 'సాహో' ద గేమ్. త్వరలో ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ సరికొత్త ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ గేమ్‌ను తీసుకొచ్చింది. ఈ మేరకు ఓ యాక్షన్ పోస్టర్‌ను ట్విట్టర్‌లో షేర్ చేసిన చిత్ర యూనిట్.. ''సాహో ద గేమ్' యాక్షన్‌ను ఫీల్ అవడానికి మీ చేతి వేళ్లతో సిద్ధంగా ఉండండి. త్వరలోనే యాక్టివేట్ అవుతుంది. దీన్ని @PixalotLabs డెవలప్ చేస్తోంది' అని రాసుకొచ్చింది. అంటే మీరే ప్రభాస్‌లా మారిపోయి ప్రత్యర్థులను హతం చేయొచ్చన్న మాట.
ఆగస్టు 30న విడుదలవుతున్న ఈ సినిమాలో నీల్ నితిన్ ముఖేష్, జాకీష్రాఫ్, చుంకీ పాండే, ఎవెలిన్ శర్మ, మందిరా బేడి, లాల్, మహేష్ మంజ్రేకర్, టినూ ఆనంద్, వెన్నెల కిషోర్, బొమన్ ఇరానీ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ త్వరలోనే జరగనుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











