twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    స్టార్ డైరెక్టర్ అట్లీ టీమ్ నుంచి మరో స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ అంధ‌కారం

    |

    కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలకు తనదైన శైలిలో సపోర్ట్ చేస్తూ సినిమాల విజయంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇక ఇటీవల ఆయన ఒక స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ సినిమాకు కూడా తన సపోర్ట్ అంధించారు. ప్యాష‌న్ స్టూడియోస్, ఓ 2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్లు పై వి విజ్ఞ‌రాజ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన సినిమా అంధ‌కారం. ఈ సినిమాను ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు అట్లీ స‌మ‌ర్ప‌ణ‌లో ఆయన భార్య ప్రియ అట్లీ, కే పూర్ణ చంద్ర‌, సుదాన్ సుంద‌ర‌మ్ నిర్మించారు.

    స్వామీరారా, పిజ్జా వంటి థ్రిల్ల‌ర్స్ తో తెలుగు ప్రేక్ష‌కుల‌కి సుప‌రిచిత‌మైన పూజా రామ‌చంద్ర‌న్ ఈ సినిమాలో కీల‌క పాత్ర‌లో నటిస్తున్నారు. ఇక పూజా రామచంద్ర‌న్ తో పాటు అర్జున్ దాస్, వినోత్ కిష‌న్, కుమార్ న‌ట‌రాజ‌న్, మీనా గోషాల్ కూడా కీలక పాత్రల్లో న‌టించారు. ఇటీవల పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా మొత్తానికి రిలీజ్ కి రెడీ అయ్యింది. ఈ సూప‌ర్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ని ప్ర‌ముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ లో విడుద‌ల చేయ‌బోతున్నారు.

     Another suspense thriller from Star Director Attlee Team andhakaram

    న‌వంబ‌ర్ 24, 2020 నుంచి నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా లైవ్ స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని నిర్మాత‌లు సుదాన్, ప్రియ అట్లీ అఫీషియల్ గా తెలిపారు. అంధ‌కారం చిత్ర టీజ‌ర్ ను ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు థ‌మ‌న్ తాజాగా త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా విడుద‌ల చేసి, చిత్ర బృందానికి తన విషెస్ అందించారు. త‌మిళ వెర్ష‌న్ లో అంధ‌గార‌మ్ టీజ‌ర్ ని ప్ర‌ముఖ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుధ్ విడుద‌ల చేశారు.. ఆ టీజ‌ర్ ఇప్పటికే సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేసింది. స్ట‌న్నింగ్ విజువ‌ల్స్ తో, థ్రిల్లింగ్ సౌండ్ తో సరికొత్త ఫీల్ ని కలిగించేలా ఉందని అర్ధనవుతోంది. మరి సినిమా విడుదల అనంతరం ఎంతవరకు పాజిటివ్ టాక్ ను అందుకుంటుందో చూడాలి.

    English summary
    Kollywood star director Attlee has been playing a key role in the success of films in recent times by supporting short films in his own style. Most recently, he also lent his support to a suspense thriller film. Passion Studios, O2 Pictures Banners on V movie directed by Vijnan Rajan. This movie His wife Priya Attlee, in the dedication of the famous director Attlee, Built by K Poorna Chandran, Sudan Sundaram.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X