అల్లు అర్జున్ - త్రివిక్రమ్ సినిమాకు మరో టైటిల్.. ఎందుకు పెట్టారో తెలుసా?
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్పీడు పెంచేశాడు. 'నా పేరు సూర్య' తర్వాత చాలా రోజులు గ్యాప్ తీసుకున్న బన్నీ.. ఇకపై వేగంగా సినిమాలు చేయాలని డిసైడ్ అయిపోయాడు. ఈ క్రమంలోనే వరుసగా సినిమాలు ఒప్పుకుంటున్నాడు. ఇందులో భాగంగా ప్రస్తుతం బన్నీ.. త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అల.. వైకుంఠపురములో..' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ వీలైనంత త్వరగా పూర్తి చేసి సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఈ సినిమా గురించి ఓ వార్త బయటకు వచ్చింది. ఇంతకీ ఏంటా న్యూస్..?

వైకుంఠపురములో ఫ్యామిలీ డ్రామా
రెండు సూపర్ హిట్ చిత్రాల తర్వాత ఈ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో ‘అల.. వైకుంఠపురములో' విషయంలో యూనిట్ తగు జాగ్రత్తలు తీసుకుంటోందట. ఈ సినిమా కోసం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అదిరిపోయే ఫ్యామిలీ డ్రామాను రాశాడని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఆయన డైలాగులు ప్రధానాకర్షణ కానున్నాయని టాక్.

అక్కడ కూడా రిలీజ్
ఎంతో ప్రతిష్టాత్మక వస్తున్న ఈ సినిమాను కేరళలో కూడా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుందని ఓ వార్త తాజాగా బయటకు వచ్చింది. అయితే, ఇది తెలుగులో మాత్రం కాదు. మలయాళంలోకి ఈ సినిమాను డబ్బింగ్ చేస్తున్నారట. అక్కడ బన్నీకి భారీ ఫాలోయింగ్ ఉన్న నేపథ్యంలోనే చిత్ర యూనిట్ ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.

టైటిల్ కూడా ఫిక్స్
ఇదే సినిమాను మలయాళంలో విడుదల చేస్తున్న నేపథ్యంలో అక్కడి భాషకు అనుగుణంగా టైటిల్ కూడా మార్చారని ఫిలింనగర్ సర్కిళ్లలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. దీని ప్రకారం.. ఈ సినిమాను ‘అంగు.. వైకుంతపురతు' అనే టైటిల్ ఫిక్స్ చేశారట. అంతేకాదు, ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేస్తారని సమాచారం. ఈ బాధ్యతలను ఆర్‌డీ ఇల్యుమినేషన్ సంస్థ తీసుకుందని తెలిసింది.

బన్నీ అక్కడ లోకల్ హీరో
అల్లు అర్జున్ కేరళలో లోకల్ హీరో అయిపోయాడు. ఆయన ప్రతి సినిమా ఆ రాష్ట్రంలో కూడా విడుదలవుతోంది. అంతేకాదు, తెలుగు తర్వాత మలయాళంలోనే బన్నీకి ఎక్కువ కలెక్షన్లు వస్తున్నాయి. అందుకే అక్కడ వరదలు వచ్చిన సమయంలో రూ. 25 లక్షలు విరాళం ప్రకటించాడు. అంతేకాదు, కేరళలోని అలప్పుజలో 66వ నెహ్రూ ట్రోపీ బోట్ రేస్ ఫెస్టివల్‌కు అతిథిగా ప్రభుత్వం నుంచి ఆహ్వనం కూడా అందుకున్నాడు బన్నీ.

‘అల.. వైకుంఠపురములో' విషయానికొస్తే..
‘జులాయి', ‘సన్నాఫ్ సత్యమూర్తి' వంటి హిట్ చిత్రాల తర్వాత అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘అల.. వైకుంఠపురములో'. ఈ సినిమా 2020 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో అతడి సరసన పూజ హెగ్డే నటిస్తోంది. గీతా ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో సుమంత్, టబు, నివేథా పేతురాజ్, నవదీప్ తదితర నటులు కనిపించనున్నారు.


Click it and Unblock the Notifications











