‘ఆ అమ్మాయితో ఒకే బెడ్‌పై.. కానీ ఆ హీరోకు మ్యాటర్ లేదు.. పక్కపై జీరో’

యంగ్ హీరో రాజ్ తరుణ్ - లావణ్యల వ్యవహారం గత కొద్దిరోజులుగా మీడియాలో నలుగుతూనే ఉంది. తనను ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని చెప్పి ఒకే ఇంట్లో సహజీవనం చేసిన రాజ్ తరుణ్ ఇప్పుడు తనను దూరం పెడుతున్నాడంటూ లావణ్య సంచలన ఆరోపణలు చేసింది. అక్కడితో ఆగకుండా ఏకంగా పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. తాను గర్భం దాలిస్తే రాజ్ తరుణే అబార్షన్ చేయించాడని ఆరోపిస్తూ దీనికి సంబంధించి మెడికల్ రిపోర్ట్స్, 100కు పైగా ఫోటోలను సమర్పించింది.

వీటి ఆధారంగా రాజ్ తరుణ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు నోటీసులు కూడా ఇచ్చారు. అయితే వ్యక్తిగత పనులతో పోలీసుల ఎదుట హాజరవ్వని రాజ్ తరుణ్ హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ పొందారు. ఈ వ్యవహారం మధ్యలో అనేక మంది తెరపైకి వచ్చి హల్‌చల్ చేశారు. ఆర్జే శేఖర్ భాషా అయితే వరుసపెట్టి ఛానెల్స్‌కు ఇంటర్వ్యూలు ఇస్తూ అన్ని ఆధారాలను బయటపెడతానని చెబుతున్నాడు. ఓ ఛానెల్ నిర్వహించిన డిబేట్‌లో లావణ్య అతనిని లైవ్‌లోనే చెప్పుతో కొట్టడం సంచలనం సృష్టించింది.

another twitst in hero raj tarun - lavanya case samyuktha video goes viral

నిజానికి ఈ కేసులో మస్తాన్ సాయి అనే పేరు ముందు నుంచి వినిపిస్తోంది. అతనితో లావణ్య రిలేషన్‌లో ఉందని రాజ్ తరుణ్ ఆరోపించాడు. ఇతనిని డ్రగ్స్ కేసులో ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇతను పలువురు అమ్మాయిలను ట్రాప్ చేశాడని... తనను కూడా అలాగే చేసి బ్లాక్ మెయిల్ చేశాడని, రాజ్‌తరుణ్‌ని కూడా చంపేస్తానని బెదిరించాడని లావణ్య ఆరోపించింది. ఇంతలో ఓ అమ్మాయి ఓ వీడియో రిలీజ్ చేసి సంచలన వ్యాఖ్యలు చేసింది.

అందులో .. '' నా పేరు సంయుక్త.. లాస్ట్ వన్ మంథ్ నుంచి ఓ హీరోపై న్యూస్‌లో బాగా వింటున్నాం. నిజం చెప్పాలంటే అతనికసలు మేటర్ లేదండి.. అలాంటి మనిషి ఇవన్నీ చేశాడంటే నాకు నవ్వొచ్చింది. ఎందుకంటే లాస్ట్ వన్ ఇయర్‌గా అతను మా ఫ్రెండ్‌తో రిలేషన్‌లో ఉన్నాడండి. వాళ్లిద్దరూ కలిసి ఉండటం ఏమో కానీ.. ఆ పిల్ల రోజూ నాకు ఫోన్ చేసి ఏడుస్తోంది, వీరిద్దరూ ఒకటే బెడ్‌పై పడుకుంటారు... ఈయన మాత్రం అటు తిరిగి పడుకుంటాడట. ఆ పిల్ల చనువుగా దగ్గరికెళ్లినా ఆ మనిషి దూరం జరుగుతాడట ''.

'' ఒక ముద్దు లేదూ ముచ్చట లేదని చెప్పి ఆ అమ్మాయి ఏడుస్తోంది. అదేదో ఆడియో కాల్‌లో వింటుండగా.. వాడిని తీసుకురా, వీడిని తీసుకురా అంటూ ఉంటుంది. ఈ మనిషి పక్కనే ఉన్నప్పుడు వాళ్లు వీళ్లు అంటోందంటే అర్ధం చేసుకోవాలిగా అతనికేమీ లేదని. 27 ఇయర్స్‌కి పెళ్లి చేసుకుంటా అన్నాడు.. ఇప్పుడు 35 వచ్చాయి. ఇంకో పదేళ్లు వచ్చినా పెళ్లి చేసుకోడు.. ఎందుకంటే అక్కడేం లేదు. సినిమాలు మాత్రం బాగానే చేస్తుంటాడు.. మనిషి చూడటానికి బాగానే ఉంటాడు, కానీ మేటర్ ఏం లేదండీ. ఆయన సినిమాల్లోనే హీరో.. బయట జీరో. ఆగస్ట్ 19 నా ఫ్రెండ్ యూఎస్ నుంచి వస్తోంది.. ఆ రోజు విత్ ప్రూఫ్స్ అన్నీ చూపించి మాట్లాడతా '' అంటూ సంయుక్త ముగించింది.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఆమె మాటలు రాజ్ తరుణ్ గురించేనా, లేక మరో హీరో గురించా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అయితే ఇదేదో ప్రమోషన్ వీడియో మాదిరిగా కనిపిస్తోందని మరికొందరు అంటున్నారు. యూఎస్ నుంచి వచ్చే ఈమె ఫ్రెండ్ ఆగస్ట్ 19న ఏం చెప్పబోతుందో చూడాలి మరి.

More from Filmibeat

Read more about: raj tarun lavanya samyuktha
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X