Don't Miss!
- News భారీ వర్షం - వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!!
- Sports రోహిత్‌పై గౌరవం..అంతకుమించి ఏం లేదు: పుకార్లపై ప్రీతి జింటా ఫైర్
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
2.0 చిత్రాన్ని వెంటాడుతున్న సమస్యలు.. విడుదల ఈ సారి కూడా!
ఏ ముహూర్తాన శంకర్ 2.0 చిత్రాన్ని ప్రారంభించాడో కానీ ఈ చిత్రం ఒక పట్టాన పూర్తి కావడం లేదు. ఇక సినిమా విడుదలవుతుంది అనగా ఎదో ఒక ఇబ్బంది తలెత్తుతోంది. ఈ చిత్రంలోని గ్రాఫిక్స్ శంకర్ కు పెద్ద తలనొప్పి వ్యవహారంగా మారింది. శంకర్ ఆలోచనలకు తగ్గట్లుగా గ్రాఫిక్స్ టీం విజువల్స్ ని రూపొందించడంలో విఫలం అవుతున్నట్లు తెలుస్తోంది.
ఈ చిత్రానికి సిజి వర్క్ కోసమే ఎక్కువసమయం పడుతోంది. ఇటీవల టీజర్ విడుదల చేసిన సమయంలో 2.0 చిత్రం నవంబర్ లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తాయి. టీజర్ కూడా వచ్చేయడంతో ఇక సినిమా విడుదల ఖాయం అని అంతా భావించారు.
తాజాగా అదే సమస్య చిత్ర యూనిట్ ని వెంటాడుతోంది. సిజి వర్క్ ఇంకా పూర్తి కాలేదట. మరోమారు సినిమా వాయిదా పడితే ఆడియన్స్ లో సినిమాపై నెగిటివ్ సంకేతాలు వెలుతాయి. ఇటీవల విడుదలైన టీజర్ కూడా అందరిని సంతృప్తి పరచలేదు. మొత్తం గ్రాఫిక్స్ తో నిపేసారని, గ్రాఫిక్స్ కూడా నాసిరకంగా ఉన్నాయనే కామెంట్స్ వినిపించాయి. దీనితో శంకర్ అలెర్ట్ అయి గ్రాఫిక్స్ టీంకు డెడ్ లైన్ విధించినట్లు ట్టెలుస్తోంది. అక్టోబర్ రెండవ వారం కల్లా గ్రాఫిక్స్ ఫినిష్ చేయాలని ఆదేశించినట్లు వార్తలు వస్తున్నాయి. ఏం జరుగుతుందో చూద్దాం!