ఎన్టీఆర్ సినిమాలో ‘మన్మథుడు’ హీరోయిన్: వాళ్ల తర్వాత ఈమెను తీసుకొస్తున్నాడు

'అరవింద సమేత.. వీరరాఘవ' వంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత.. టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. దీన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్లపై నందమూరి కల్యాణ్ రామ్, రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక, ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రకటన ఎప్పుడో వెలువడినప్పటికీ.. రెగ్యూలర్ షూటింగ్ మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో దీనికి సంబంధించిన అప్‌డేట్స్ బయటకు రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ లీకైంది.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా చేస్తుందని ఇటీవల ఓ న్యూస్ బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఇక, ఇందులో ఓ కీలకమైన పాత్ర కోసం 'మన్మథుడు' హీరోయిన్ అన్షు అంబానీని తీసుకున్నారని తాజాగా ఓ వార్త ఫిలిం నగర్ ఏరియాలో చక్కర్లు కొడుతోంది. హీరోయిన్‌గా రెండు మూడు సినిమాల్లో మాత్రమే నటించిన ఆమె.. టాలీవుడ్‌కు దూరమై చాలా కాలమే అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ అందాల భామను మరోసారి తెలుగు సినిమాల్లోకి తీసుకొచ్చేందుకు ఇప్పుడు త్రివిక్రమ్ ప్లాన్ చేశాడనే టాక్ వినిపిస్తోంది.

Anshu to play Key Role in Jr NTR - Trivikram Movie

గతంలో తన సినిమా ద్వారా నదియా, కుష్బూ, స్నేహ వంటి సీనియర్ హీరోయిన్లతో రీఎంట్రీ ఇప్పించిన త్రివిక్రమ్.. ఇప్పుడు అన్షును తీసుకు రాబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. ఇక, ఈ సినిమాకు 'అయిననూ పోయి రావలె హస్తినకు' అనే టైటిల్ ఎప్పటి నుంచో ప్రచారంలో ఉంది. ఇందులో ఎన్టీఆర్ యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా నటిస్తున్నాడని.. దీనితో పాటు మరో వైవిధ్యమైన పాత్రనూ పొషిస్తున్నాడని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇక, ఈ చిత్రానికి యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ ఎస్ థమన్ సంగీతం సమకూర్చబోతున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X