twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘అంతరిక్షం‘ ట్రైలర్: ఫెయిలైతే ఎలా అని అడక్కూడదు... అంచనాలు పెంచేసిసిన వరుణ్ తేజ్!

    |

    ఫెయిల్ అయితే ఎలా? అని అడక్కూడదు... గెలవాలంటే ఏం చేయాలి అని మాత్రమే అలోచించాలి.... అంటూ వరుణ్ తేజ్ నటించిన 'అంతరిక్షం' ట్రైలర్ ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలు మరింత పెంచుతూ విడుదలైంది.

    వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, అతిథి రావు హైదరి హీరో హీరోయిన్లుగా ఘాజీ ఫేం సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'అంతరిక్షం'. తెలుగులో రూపొందుతున్న తొలి స్పేస్ కాన్సెప్ట్ మూవీ ఇది. ఇందులో వరుణ్ తేజ్, అదితి రావు హైదరి వ్యోమగాముగా కనిపించబోతున్నారు.

    విజువల్స్ హాలీవుడ్ రేంజిలో ఉన్నాయి

    విజువల్స్ హాలీవుడ్ రేంజిలో ఉన్నాయి

    ట్రైలర్ చూస్తుంటే తెలుగు సినిమా చూసినట్లు లేదని, హాలీవుడ్ సినిమా ట్రైలర్ చూసినట్లు ఉంది అంటున్నారు అభిమానులు. స్పేస్‌లో వచ్చే సీన్లు సినిమాలో హైలెట్ అవ్వడంతో పాటు ప్రేక్షకుల్లో ఉంత్కంఠ రేపుతాయని స్పష్టమవుతోంది.

    నీరా శాటిలైట్

    నీరా శాటిలైట్

    నీరా అనే శాటిలైట్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. అయితే ఇందులో సాంకేతిక సమస్య రావడంతో రంగంలోకి దిగిన దేవ్(వరుణ్ తేజ్) ఏం చేశాడు? శాటిలైట్ ప్రయోగం విఫలం కాకుండా ఎలాంటి రిస్క్ తీసుకున్నాడు అనేది తర్వాతి కథ.

    హాలీవుడ్ టెక్నీషియన్స్

    హాలీవుడ్ టెక్నీషియన్స్

    ది ఎక్స్‌పెండబుల్స్ 2, ట్రాయ్, జీరో డార్క్ థర్టీ, హెర్క్యులెస్, ది ఇన్‌విజబుల్, లవింగ్ పాబ్లో, రీబార్న్, స్నిప్పెట్, మార్కో‌పోలో, గేమ్ అఫ్ థ్రోన్స్ వంటి హాలివుడ్ ప్రాజెక్టులకు పని చేసిన స్టంట్ మాస్టర్స్ జిబెక్, టోడోర్ లాజరవ్ (జూజి), రోమన్ ఈ చిత్రానికి పని చేశారు.

    డిసెంబర్ 21న విడుదల

    డిసెంబర్ 21న ఈ చిత్రం ప్రేక్షకల ముందుకు రాబోతోంది. వరుణ్ తేజ్, అదితిరావ్ హైదరీ, లావణ్య త్రిపాఠి, సత్యదేవ్, రాజా, అవసరాల శ్రీనివాస్, రెహ్మాన్ (రఘు) తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి నిర్మాతలు: రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి, కెమెరా: జ్ఞానశేఖర్ వి.ఎస్, ఎడిటర్: కార్తీక శ్రీనివాస్, ప్రొడక్షన్ డిజైనర్స్: రామకృష్ణ సబ్బాని- మౌనిక నిగొత్రే సబ్బాని, సంగీతం: ప్రశాంత్ ఆర్.విహారీ, డైలాగ్స్: కిట్టు విస్సాప్రగడ, కాస్ట్యూమ్స్: అశ్వంత్ బైరి, స్టంట్స్: టోడోర్ లాజారోవ్, సి.జి: రాజీవ్ రాజశేఖరన్, ఎస్.ఎఫ్.ఎక్స్: మైష్ త్యాగి, దర్శకత్వం: సంకల్ప్ రెడ్డి.

    English summary
    Antariksham 9000 KMPH Theatrical Trailer release. Starring: Varun Tej, Lavanya Tripathi, Aditi Rao Hydari, Satya Dev, Raja, Srinivas Avasarala, Rahman, Producers: Rajeev Reddy Yeduguru, Radha Krishna Jagarlamudi (Krish) and Sai Babu Jagarlamudi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X