వరుణ్ తేజ్ 'అంతరిక్షం' సెన్సార్ కంప్లీట్.. 21న లిఫ్ట్ ఆఫ్!
వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం అంతరిక్షం. సంకల్ప్ రెడ్డి దర్శత్వంలో తెరకెక్కుతున్న ఈ స్పేస్ థ్రిల్లర్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఒక రకంగా టాలీవుడ్ లో ఇది భారీ ప్రయోగాత్మక చిత్రం. ఘాజి చిత్రంతో సంకల్ప్ రెడ్డి విమర్శకుల నుంచి ప్రశంసలు పొందాడు. డిసెంబర్ 21 న ఈ చిత్రం విడుదల కానుండడంతో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలు మొదలు పెట్టింది.
ఇటీవలవిడుదలైన ట్రైలర్ మిలియన్ల కొద్దీ వ్యూస్ తో దూసుకుపోతోంది. అంతరిక్షంలో జరిగే సన్నివేశాలు ఉత్కంఠ భరితంగా ఉండబోతున్నాయి. తాజాగా ఈ చిత్ర సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. సెన్సార్ సభ్యులు ఎలాంటి కట్స్ లేకుండా క్లీన్ 'యూ' సర్టిఫికెట్ జారీ చేశారు. అంతరిక్షం చిత్రం డిసెంబర్ 21న లిఫ్ట్ ఆఫ్ అయ్యేందుకు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సినిమా థియేటర్స్ కలుద్దాం అంటూ అదితి రావు హైదరి ట్విట్టర్ లో పేర్కొంది.

వరుణ్ తేజ్, అదితి రావు హైదరి ఈ చిత్రంలో వ్యోమగాములుగా నటిస్తున్నారు. లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ ప్రేయసిగా నటిస్తోంది. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్స్ ఆధ్వర్యంలో ఈ చిత్ర సన్నివేశాలు చిత్రీకరించారు.


Click it and Unblock the Notifications











