Ante Sundaraniki Pre Release Event: అప్పుడు పవన్ కళ్యాణ్ కు కథ చెప్పాలని వెళ్ళా: సుకుమార్

నాని నజ్రియా జంటగా నటించిన అంటే సుందరానికి సినిమా శుక్రవారం రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ శిల్పకళావేదికలో గురువారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు ప్రత్యేక అతిథిగా పవన్ కల్యాణ్ విచ్చేశారు. ఈ వేడుకలో మరి కొంతమంది దర్శకులు నిర్మాతలు కూడా పాల్గొన్నారు. ఇప్పుడు సుకుమార్ సినిమా గురించి అలాగే పవన్ కళ్యాణ్ గురించి కూడా ప్రత్యేకంగా ఒక వివరణ ఇచ్చారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

సుకుమార్ స్పీచ్

సుకుమార్ స్పీచ్

డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ.. ముందుగా పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడికి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక ఈ సినిమాలో ముందే చూడడం జరిగింది. సినిమా చూస్తున్నంత సేపు దర్శకుడిగా ఒక ఈగో ఫీలింగ్ అయితే కలిగింది. చూసిన తర్వాత దర్శకుడు పర్వాలేదు బాగానే చేశాడు అని చెప్పాను. సెకండాఫ్ చూసిన తర్వాత మాత్రం ఈ సినిమా చాలా అద్భుతంగా వచ్చిందని డైరెక్ట్ గా దర్శకుడికి చెప్పేశా అని అన్నారు.

 సెకండ్ హాఫ్ అద్భుతంగా..

సెకండ్ హాఫ్ అద్భుతంగా..

ఫస్టాఫ్ చూసినంత సేపు ఏదో నార్మల్ గా అనుకున్నాను కానీ సెకండాఫ్ తో సినిమా రూపం మొత్తం మారిపోయింది. అద్భుతంగా వచ్చింది. ఇక నాని అయితే ఒక నటన ఆకాశం అని చెప్పాలి. నవరసాల్లో ఎన్నో రకాలు ఉంటాయి. వాటన్నిటి కూడా నాని చాలా చక్కగా హ్యాండిల్ చేయగలడు. ఈ సినిమా లో కూడా చాలా బాగా నటించాడు. ఒక రోహిణి గారి గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాలి. ఎమోషనల్ సన్నివేశాల్లో ఆమె చాలా అద్భుతంగా నటించారు. నరేష్ గారు కూడా ఈ సినిమాలో తన క్యారెక్టర్ ను చాలా బాగా ప్రెజెంట్ చేశారు.

వారు ఇండస్ట్రీలో ఉండడం అదృష్టం

వారు ఇండస్ట్రీలో ఉండడం అదృష్టం

ఇక శికావత్ సతీమణి నజ్రియా కూడా ఈ సినిమాలో చాలా బాగా నటించారు. నాని నజ్రియా క్యారెక్టర్స్ రెండు కూడా చాలా నేచురల్ గా అనిపించాయి. చూడటానికి చాలా ముచ్చటగా అనిపించింది. మైత్రి మూవీ మేకర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు నవీన్ గారు ఇండస్ట్రీలో ఉండడం మీ అదృష్టం అని ఒక ప్రముఖ వ్యాపారవేత్త నాతో చెప్పారు.. అని సుకుమార్ అన్నారు.

కథ చెప్పాలని..

కథ చెప్పాలని..

ఇక పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా ఒక మాట చెప్పాలి. మొత్తం రెండు సందర్భాల్లో ఆయనను మీట్ ఇవ్వడం జరిగింది. ఆర్య సినిమా తర్వాత నేను కథ చెప్పడానికి కలిసినప్పుడు ఎందుకో చెప్పలేకపోయాను. నన్ను అలా కొంత సేపు చూసి మీరు తొందరగా పెళ్లి చేసుకోవాలి అని చెప్పారు. ఆ వెంటనే నా పెళ్లి జరిగింది.. అని అన్నారు.

రెండవ సారి కలిసినప్పుడు

రెండవ సారి కలిసినప్పుడు

మొన్న భీమ్లా నాయక్ షూటింగ్ జరుగుతూ ఉంటే పక్కనే సినిమా షూటింగ్ కూడా జరుగుతుంది. వెంటనే వెళ్లి పవన్ కళ్యాణ్ దగ్గర కూర్చున్నప్పుడు ఆయాసపడుతూ మాట్లాడాను. ఆ తర్వాత నాతో పాటు త్రివిక్రమ్ గారు కూడా వెంటనే వచ్చి ఒక విషయం చెప్పారు. మీరు ఏదో ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు అని ఒకసారి చూపించుకోవాలి అని పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లుగా త్రివిక్రమ్ గారు వివరణ ఇచ్చినట్లు సుకుమార్ తెలియజేశాడు. కానీ నేను ఆయాసపడింది మిమ్మల్ని కలిసిన ఆనందం వలన. ఇక ఈ సినిమా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని సుకుమార్ తెలియజేశారు.

బుచ్చి బాబు స్పీచ్

బుచ్చి బాబు స్పీచ్

బుచ్చి బాబు మాట్లాడుతూ.. ముందుగా పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. పవన్ కళ్యాణ్ గారికి ఈ వేదికలో ఒక మాట చెప్పాలని అనుకుంటున్నాను. మాది పిఠాపురం అక్కడ రెండే రెండు ఫేమస్. ఒకటి అక్కడే పుట్టిన దత్తాత్రేయ స్వామి. రెండు మీ ఫ్యాన్స్. నేను ఉప్పెన సినిమా రిలీజ్ సమయంలో మిమ్మల్ని కలిసినప్పుడు ఇలాంటి మట్టి సినిమాలు రావాలి అని చాలా స్ఫూర్తినిచ్చే విధంగా మాట్లాడారు. మీ మాటలు నేను ఎప్పటికీ మర్చిపోలేను అని బుచ్చి బాబు తెలియజేశారు. ఇక అంటే సుందరానికి సినిమాను రీసెంట్గా చూడడం జరిగిందని ఈ సినిమా చాలా బాగా వచ్చిందని దర్శకుడు వివేక్ ఆత్రేయ బలే చేసాడు అనిపించినట్లు తెలియజేశారు. ఇక ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని నేను కోరుకుంటున్నానని కూడా బుచ్చి బాబు మాట్లాడారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X