Ante Sundaraniki Pre Release Event: పవన్ కళ్యాణ్ తో చిన్నప్పటి నుంచి పరిచయం.. నాని

నాని నజ్రియా జంటగా నటించిన అంటే సుందరానికి.. సినిమా శుక్రవారం రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ శిల్పకళావేదికలో గురువారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు ప్రత్యేక అతిథిగా పవన్ కల్యాణ్ విచ్చేశారు. ఈ వేడుకలో మరి కొంతమంది దర్శకులు నిర్మాతలు కూడా పాల్గొన్నారు. ఇక హీరో నాని పవర్ఫుల్ స్పీచ్ తో ఎంతగానో ఆకట్టుకున్నాడు.

పర్ఫెక్ట్ మీనింగ్

పర్ఫెక్ట్ మీనింగ్

నాని మాట్లాడుతూ.. ప్రీ రిలీజ్ ఈవెంట్ అనే పదానికి కరెక్టు అర్థం దీనికంటే మరొకటి ఉండదు. ఎందుకంటే రేపు సినిమా విడుదలవుతోంది. ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది కాబట్టి ఇది పర్ఫెక్ట్ మీనింగ్ అనే చెప్పాలి. ఇక్కడికి వచ్చినా దర్శకులకు అలాగే టెక్నీషియన్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.. అని అన్నారు.

 చిన్నప్పటి నుంచి పవన్ తో పరిచయం

చిన్నప్పటి నుంచి పవన్ తో పరిచయం

పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. నేను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత హీరోలందరితోని కలిశాను. మాట్లాడాను. అయితే ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడే అవకాశం సందర్భంగానే నాకు రాలేదు. ఈ 14 ఏళ్ల సినిమా కెరీర్లో ఆయనను ఎప్పుడూ కలవలేదు. మిగతా అందరి విషయంలో అయితే నాకు ఈ మద్యే పరిచయం అన్న ఒక ఫీలింగ్ ఉండేది. కానీ ఇప్పుడే కలిసిన పవన్ కళ్యాణ్ గారితో మాత్రం చిన్నప్పటి నుంచి పరిచయం ఉన్నట్లు ఫీలింగ్ కలుగుతోంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈ వేడుకకు రావడం చాలా ఆనందంగా ఉంది.. అందుకు ఆయనకు మరొకసారి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను

 మా వాళ్లందరికీ కొంచెం తిక్కుంది

మా వాళ్లందరికీ కొంచెం తిక్కుంది

ఇక ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశారు. సహాయ దర్శకులు అలాగే సంగీత దర్శకుడు నిర్మాతలు మిగతా టెక్నిషియన్స్ అందరూ కూడా చాలా బాగా కష్టపడ్డారు. పవన్ కళ్యాణ్ గారి స్టైల్లో చెప్పాలి అంటే మా వాళ్లందరికీ కొంచెం తిక్కుంది కానీ దానికో లెక్కుంది అన్నట్లుగా వర్క్ చేస్తూ ఉంటారు. ఇక వారి లెక్క ఏమిటో కూడా మీకు రేపు అర్థమవుతుంది.. అని అన్నారు.

సక్సెస్ అయినా వైబ్ కనిపిస్తోంది

సక్సెస్ అయినా వైబ్ కనిపిస్తోంది

ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరి దగ్గర నుంచి చాలా బాగా వర్క్ చేయించుకున్నారు. ఇక ఈ సినిమాను చూసిన తర్వాత నాకు చాలా బాగా అర్థమైపోయింది. ఈ సినిమా రేపు మీ అందరూ చూసిన తరువాత మేమైతే ఎంతగా ఎంజాయ్ చేసామో మీరు కూడా అంతే బాగా ఎంజాయ్ చేస్తారు అని అర్థమవుతుంది. నాకు అంతకు మించి కావాల్సింది ఏమీ లేదు. ఇప్పటికే సినిమాకు రిలీజ్ అయ్యి.. సక్సెస్ అయినా వైబ్ కనిపిస్తోంది.. అని అన్నారు.

నమ్మకం ఉంది

నమ్మకం ఉంది

ఇక ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరూ అలాగే నటీనటులు కూడా ఎలాంటి విభేదాలు చూడకుండా అందరూ సమానంగా కలిసి వర్క్ చేశారు. ఇలాంటి సినిమాలు ఇండస్ట్రీలో కావాలి. రేపు తప్పనిసరిగా గెలుస్తాం అని నాకు నమ్మకం ఉంది. శ్యామ్ సింగరాయ్ సమయంలో క్రిస్మస్ తమదేనని ఒక డైలాగ్ కొట్టడం జరిగింది. ఇక ఇప్పుడు అలాంటివు ఏమైనా అనాలా అని అనుకున్నప్పుడు నజ్రియా తమ్ముడు ఒక సలహా ఇచ్చాడు. సినిమా ట్రైలర్ ఎంటర్టైన్మెంట్ కాదని ఎంజాయ్మెంట్ అని అన్నాడు. 'అంటే సుందరానికి' సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ కాదు ఎంజాయ్మెంట్ అని చెప్పడం చాలా హ్యాపీగా అనిపించింది.. అని నాని వివరణ ఇచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X