Ante Sundaraniki Pre Release Event: ఈ సినిమా నాకు స్పెషల్.. థియేటర్లో పవన్ సినిమా చూశా: నజ్రియా
నాని నజ్రియా జంటగా నటించిన అంటే సుందరానికి సినిమా శుక్రవారం రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ శిల్పకళావేదికలో గురువారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు ప్రత్యేక అతిథిగా పవన్ కల్యాణ్ విచ్చేశారు. ఈ వేడుకలో మరి కొంతమంది దర్శకులు నిర్మాతలు కూడా పాల్గొన్నారు. ఇక హీరోయిన్ నజ్రియా ప్రత్యేకంగా మాట్లాడిన విధానం ఎంతగానో ఆకట్టుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
నజ్రియా మాట్లాడుతూ.. ఈరోజు మాట్లాడడానికి చాలా టెన్షన్ గా ఉంది. ఈ వేడుకకు పవన్ కళ్యాణ్ గారు రావడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ మన ముందుగా ఉండటం కూడా చాలా హ్యాపీ మూమెంట్. నేను ఇది ఎప్పటికీ మర్చిపోలేను. ఇక్కడికి వచ్చినందుకు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇక హైదరాబాదులో మొదట నేను చూసిన సినిమా భీమ్లా నాయక్. ఆ సినిమా చూసినప్పుడు ఒక మ్యాజిక్ కనిపించింది. అలాగే దర్శకుడు సుకుమార్ గారు కూడా ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది.

ఈ సినిమాను నిర్మించిన నిర్మాతలకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలపాలి. వారు లేకపోతే ఈ సినిమా ఇంత బాగా వచ్చేది కాదు. అలాగే సహాయక దర్శకులు కూడా ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. చిత్ర యూనిట్ టు పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా నా కుటుంబ సభ్యుల్లో ఒకరిగా బాండింగ్ ఏర్పడింది. అలాగే ఈ సినిమాలో నానితో కలిసి నటించడం కూడా చాలా గర్వంగా అనిపించింది. అతను ఈ సినిమాలో అద్భుతంగా నటించాడు. అంతేకాకుండా నాని నుంచి నేను చాలా నేర్చుకున్నాను.
ఇక చివరగా ఈ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ గురించి మాట్లాడాల్సి ఉంది. అతను ఈ సినిమాలో నన్ను ఒక భాగం చేసినందుకు ఎంతగానో సంతోషిస్తున్నాను. నేను ఈ పాత్ర చేయడానికి ముఖ్య కారణం దర్శకుడే. అతను లేకపోతే ఇంత బాగా నేను నా క్యారెక్టర్ ను ప్రజెంట్ చేసేదాన్ని కాదు. సంగీత దర్శకుడు వివేక్ సాగర్ కూడా ఈ సినిమా చాలా మంచి సంగీతం ఇచ్చాడు. తప్పకుండా ఈ సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది రేపు థియేటర్లలో ఈ సినిమాను చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగే అభిమానుల గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాలి నా మొదటి సినిమా ఇక్కడ విడుదల కాకముందే నన్ను ఎంతగానో లవ్ చేశారు. అందుకు మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలపాలి. రేపు అందరం థియేటర్లలో కలుద్దాం.. అని నజ్రియా వివరణ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











