NTR30: ఎన్టీఆర్‌కు హీరోయిన్ ఫిక్స్.. అంత క్యూట్ బ్యూటీకి అలాంటి పాత్రా!
దాదాపు ఐదారేళ్లుగా వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ కెరీర్‌లోనే అత్యుత్తమ ఫామ్‌తో కనిపిస్తున్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఐదు భారీ విజయాలను ఖాతాలో వేసుకున్న అతడు.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన RRR (రౌద్రం రణం రుధిరం) మూవీతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిపోయాడు. దీంతో మరింత ఉత్సాహంతో సినిమాలు చేయాలని భావిస్తున్నాడు. ఇందులో భాగంగానే ఎన్టీఆర్ ఇప్పటికే రెండు ప్రాజెక్టులను కూడా ప్రకటించేశాడు. అందులో టాప్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించే మూవీ ఒకటి.
RRR (రౌద్రం రణం రుధిరం) మూవీ పట్టాలపై ఉన్నప్పుడే స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తన 30వ చిత్రాన్ని బడా డైరెక్టర్ కొరటాల శివతో చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అయితే, ఈ సినిమా అనుకున్న సమయానికి మొదలు కావడం లేదు. దీంతో అసలు ఈ ప్రాజెక్టు ఉంటుందా? లేదా? అన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితమే దీనికి సంబంధించిన గ్లిమ్స్ వీడియోను రిలీజ్ చేశారు. అలాగే, ఇటీవలే ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా సాగుతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. దీంతో ఈ ప్రాజెక్టుపై క్లారిటీ వచ్చేసింది.

క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాను డిసెంబర్ నెల నుంచి మొదలు పెట్టబోతున్నట్లు ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఇందులో నటించే హీరోయిన్ గురించి ఓ ఆసక్తికరమైన వార్త లీకైంది. ఈ సినిమా కోసం క్యూట్ బ్యూటీ అను ఇమాన్యూయేల్‌ను చిత్ర యూనిట్ ఫైనల్ చేసిందని తెలిసింది. అయితే, ఇది మెయిన్ హీరోయిన్ రోల్ కాదని అంటున్నారు. సెకెండ్ హీరోయిన్ పాత్ర కోసమే ఆమెను తీసుకున్నట్లు తెలుస్తోంది. అంటే.. త్వరలోనే మెయిన్ ఫీమేల్ లీడ్‌ను కూడా తీసుకుంటారన్న మాట.
జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ - కొరటాల కాంబోలో రాబోతున్న ఈ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతుంది. ఈ చిత్రాన్ని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి కోలీవుడ్ యంగ్ సెన్సేషన్ అనిరుథ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇది హిస్టారికల్ స్టోరీతో రాబోతుందని అంటున్నారు.


Click it and Unblock the Notifications











