SSMB28: మహేశ్ బాబు మూవీలో మరో హీరోయిన్.. రాక్షసికే ఓటేసిన త్రివిక్రమ్
ఈ మధ్య కాలంలో వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ కెరీర్‌లోనే భీకరమైన ఫామ్‌తో దూసుకుపోతోన్నాడు టాలీవుడ్ టాప్ హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబు. 'భరత్ అనే నేను' చిత్రం నుంచి వరుసగా 'మహర్షి', 'సరిలేరు నీకెవ్వరు' వంటి హ్యాట్రిక్ హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. దీంతో అతడి కెరీర్ జెట్ స్పీడుతో దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే ఇటీవలే మహేశ్ 'సర్కారు వారి పాట' అనే సినిమాతో వచ్చాడు. కానీ, ఇది అనుకున్న రీతిలో కలెక్షన్లను రాబట్టలేక ఏబో ఏవరేజ్‌గా నిలిచింది.
ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ బాబు.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయింది. ఫస్ట్ షెడ్యూల్‌లో అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేసుకున్నారు. ఇదంతా అదిరిపోయేలా వచ్చిందని తెలుస్తోంది. ఇక, దీనికి సంబంధించిన కొత్త షెడ్యూల్‌ను డిసెంబర్ మొదటి వారం నుంచి మొదలెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి అదిరిపోయే న్యూస్ లీకైంది.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ - సూపర్ స్టార్ మహేశ్ బాబు కలయికలో రాబోయే సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా చేస్తోన్న విషయం తెలిసిందే. ఈమెతో పాటు మరో బ్యూటీని కూడా ఇందులో నటింపజేస్తారని అంటున్నారు. ఇందులో భాగంగానే ఎంతో మంది పేర్లు తెరపైకి వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో క్యూట్ లేడీ అను ఇమాన్యూయేల్ కూడా నటిస్తున్నట్లు తెలిసింది. వాస్తవానికి ఈ పాత్ర కోసం ప్రియాంక అరుల్ మోహన్‌ను తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ, 'ఊర్వశివో రాక్షసివో'లో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న ఈ బ్యూటీకే గురూజీ ఓటు వేశారనే టాక్ వినిపిస్తోంది.
క్రేజీ కాంబోలో రాబోతున్న ఈ చిత్రాన్ని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే ఇందులో హీరోయిన్‌గా చేస్తోంది. థమన్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. ఇక, దీనికి 'అర్జునుడు', 'అతడే పార్థు' వంటి టైటిళ్లు పరిశీలిస్తున్నారు. ఇక, ఈ మూవీలో ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలను చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











