ఆ దేశంలో యుద్ధం.. అందుకే ప్రిన్స్ మూవీ చూడాలి.. దర్శకుడు అనుదీప్ భావోద్వేగం
శివకార్తికేయన్ సరసన మారియా ర్యాబోషప్క కథానాయిక నటిస్తోంది. నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో సునీల్ నారంగ్, డి.సురేష్ బాబు, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్టోబర్ 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. పాన్ ఇండియా స్టార్ విజయ దేవరకొండ, స్టార్ దర్శకుడు హరీష్ శంకర్ ముఖ్య అతిధులుగా ఈ వేడుకకు హాజరయ్యారు.

అనుదీప్ మాట్లాడుతూ.. నిర్మాతలు సురేష్ బాబు, సునీల్ నారంగ్, జాన్వికి కృతజ్ఞతలు. ఆ అవకాశం ఇచ్చిన శివ కార్తికేయన్ గారికి కృతజ్ఞతలు. ప్రస్తుతం సమయంలో అందరూ చూడాల్సిన సినిమా ప్రిన్స్. తమన్, మనోజ్ పరమ హంస లాంటి పెద్ద టెక్నిషియన్స్ తో పని చేయడం ఆనందంగా వుంది. నా కోరైటర్ జగన్, లిరిక్ రైటర్ రామజోగయ్యశాస్త్రి గారికి కృతజ్ఞతలు. ఈ ఈవెంట్ కి వచ్చిన విజయ్ దేవరకొండ, హరిష శంకర్ గారికి థాంక్స్. అక్టోబర్ 21 అందరూ ప్రిన్స్ ని థియేటర్ లో చూసి ఎంజాయ్ చేయాలి'' అని కోరారు.


Click it and Unblock the Notifications











