Don't Miss!
- Finance Ola Cabs IPO: త్వరలో ఓలా క్యాబ్స్ ఐపీఓ..
- Technology ధర రూ.14999 కే 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ కొత్త వేరియంట్ విడుదల..!!
- News టీడీపీ ప్లాన్ బీ- వంగవీటి రాధాకు టికెట్?
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్‌కు రావట్లేదు- CSK కోచ్
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
ఏదో చేయాలనే కసి వల్లనే శివశంకరి ఫ్యూజన్.. కోటి, ఆర్పీ, రఘు కుంచే
టాలీవుడ్లో టాలెంటెడ్ సింగర్‌గా పేరు తెచ్చుకున్న అనుదీప్ రూపొందించిన ఆల్బమ్ శివశంకరీ ఫ్యూజన్ కవర్ సాంగ్ లాంచ్ ప్రసాద్ ల్యాబ్స్‌లో ప్రముఖ సంగీత దర్శకుడు కోటి చేతుల మీదుగా శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్.పి.పట్నాయక్, రఘుకుంచె, జెబి, సాయికార్తిక్, సింగర్స్ రఘురామ్, రమ్యబెహర, మాళవిక, విజయలక్ష్మి, వేణు మనీషా ఎరబత్తిని తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రముఖ సంగీత దర్శకుడు కోటి మాట్లాడుతూ... సాంగ్ విజువల్స్‌గానీ, అనుదీప్ ప్రజంటేషన్గానీ అద్భుతంగా ఉంది. పెండ్యాల నాగేశ్వరావుగారి కంపోజిషన్‌లో ఘంటసాల గారు ఆలపించిన ఓ గొప్ప సాంగ్ ఇది. అలాంటి గొప్ప సాంగ్‌ను మోడ్రన్‌గా ఫ్యూజన్ కవర్ సాంగ్‌గా తీర్చిదిద్దాడు అనుదీప్. రియల్ ఫ్యూజన్ అంటే ఇది అనేలా ప్రజంటేషన్ ఉంది. నాకు అనుదీప్ ఎప్పటి నుంచో తెలుసు. తనలో ఏదో చేయాలన్న తపనే ఈ రోజు ఈ సాహసం చేసేలా చేసింది. ఈ సాంగ్‌తో అనుదీప్ ఒక మంచి స్థాయికి చేరతాడు. ఒరిజినల్ సాంగ్‌ను ఏ మాత్రం చెడగొట్టకుండా చేయడం గొప్ప విషయం. ఈ పాటను నా చేతుల మీదుగా లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ పాట అనుదీప్‌కు మంచి పేరు తీసుకరావాలని కోరుకుంటున్నా అన్నారు.
సంగీత దర్శకుడు ఆర్.పి.పట్నాయక్ మాట్లాడుతూ... శివశంకరీ పాటలోని ఆత్మకు ఎలాంటి నష్ట జరుగకుండా ప్రజంట్ చేసిన అనుదీప్‌ను అభినందిస్తున్నా. ఈ పాటను పాడాలనుకోవడమే ఓ సాహసం. అలాంటిది సోల్ మిస్ అవకుండా రీమిక్స్ చేయడం మరో సాహసం. అనుదీప్‌కు మంచి కంపోజర్వి అవుతావు అని చాలాసార్లు చెప్పాను. కచ్చితంగా మంచి సంగీత దర్శకుడు అవుతాడు. సింగర్‌గా ఏంటో తెలుసు. కంపోజర్‌గా కూడా తనేంటో త్వరలో చూడబోతున్నాం. ఈ పాట తనకు మంచి పేరు తీసుకరావాలని కోరుకుంటున్నా అన్నారు.
రఘు కుంచె మాట్లాడుతూ...అనుదీప్‌లో ఏదో చేయాలన్న తపన, కసి ఉంది. అదే తనను పెద్ద స్థాయిలోకి తీసుకెళ్తుంది అన్నారు.
సాయికార్తిక్ మాట్లాడుతూ...నాకు చాలా ఇష్టమైన పాట ఇది. ఈ పాటను ఫ్యూజన్ కవర్ చేసి సాహసం చేసిన అనుదీప్ కు ఆల్ ది బెస్ట్ తెలుపుతున్నా అన్నారు.
సింగర్ అనుదీప్ మాట్లాడుతూ...ఏదైనా ఒక మంచి కవర్ సాంగ్ చేయాలనుకుంటున్న తరుణంలో శివశంకరీ సాంగ్ ను తీసుకుని ఫ్యూజన్ కవర్ సాంగ్ చేసాం. దీనికి ఆట సందీప్ కొరియోగ్రఫీ చేసారు. అందరికీ నచ్చుతుందన్న నమ్మకం ఉంది. ఈ కార్యక్రమానికి వచ్చి నన్ను బ్లెస్ చేసిన ప్రతి ఒక్కకిరీ నా కృతజ్క్షతలు అన్నారు.