సాయి పల్లవి కొత్త మూవీ నిర్మాత ఆకస్మిక మృతి: సినిమా విడుదలకు ముందే విషాదం

తెలుగు సినీ ఇండస్ట్రీలో కొద్ది రోజులుగా వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఎంతో మంది సినీ ప్రముఖులు కరోనా కారణంగా ప్రాణాలను కోల్పోయారు. అదే సమయంలో మరికొందరు ఆర్టిస్టులు, టెక్నీషియన్లు పలు రకాల సమస్యలతో మరణించారు. సెకెండ్ వేవ్‌లో ఈ పరిస్థితి మరింత ఎక్కవగా కనిపిస్తోంది. ఫలితంగా ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందో అని అంతా భయపడిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో టాలీవుడ్‌లో మరో దురదృష్టకర సంఘటన జరిగింది. తాజాగా ప్రముఖ నిర్మాత అన్నంరెడ్డి కృష్ణ కుమార్ గుండెపోటుతో కన్నుమూశారు.

సాయి పల్లవి నటించిన 'అనుకోని అతిథి' అనే సినిమాను విడుదల చేస్తున్న నిర్మాత అన్నంరెడ్డి కృష్ణ కుమార్‌కు ఈరోజు ఉదయం గుండెపోటు వచ్చినట్లు తెలిసింది. ఆయన కుటుంబ సభ్యులు గమనించే లోపే ఆయన ప్రాణాలను కోల్పోయినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత వైద్యులు కూడా ఈ ప్రొడ్యూసర్ మరణాన్ని ధృవీకరించారని అంటున్నారు. ఈయన మరణంతో సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఇదిలా ఉండగా.. అన్నంరెడ్డి కృష్ణ కుమార్ సినిమా 'అనుకోని అతిథి' మే 28 నుంచి ఆహా వీడియోలో స్ట్రీమింగ్ కాబోతుంది. అంతలోనే ఈ విషాదం జరిగింది.

Anukoni Athidhi Movie Producer Annamreddy Krishna Kumar Passes Away

వెర్సటైల్ యాక్టర్ ఫాహద్ ఫాజిల్, టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయి పల్లవి జంటగా.. ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రలో నటించిన మలయాళం చిత్రం 'అథిరన్'.. సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా మాలీవుడ్‌లో సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా తెలుగు రిలీజ్ హక్కులను అన్నంరెడ్డి కృష్ణ కుమార్ తీసుకున్నారు. అయితే, అప్పుడు ఈ సినిమాను విడుదల చేయడం కుదరలేదు. దీంతో ఆహా ఓటీటీ సంస్థకు స్ట్రీమింగ్ హక్కులను అమ్మేశారు. మరో రెండు రోజుల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సమయంలోనే నిర్మాత మరణించడం షాక్‌కు గురి చేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X