కార్తీకేయ 2 కోసం బాలీవుడ్ నటుడు.. అదిరిపోయే అప్డేట్
ప్రస్తుతం నిఖిల్ నటిస్తోన్న కార్తికేయ 2 సినిమా నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతోంది. చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన కార్తికేయ సినిమా ఎంతగా హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఆ మూవీ సీక్వెల్‌కు ఇప్పుడు ఫుల్ స్వింగ్‌లో దూసుకుపోతోంది. తాజాగా ఈ మూవీ నుంచి ఓ అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్ర కోసం బాలీవుడ్ ప్రముఖ నటుడిని తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
నిఖిల్ అసలే పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాడు. కొత్త కొత్త కాన్సెప్ట్‌లను ఎంచుకుంటూ అందరి కంటే ముందుగా ఉన్నాడు. చివరగా అర్జున్ సురవరం అంటూ మంచి హిట్ కొట్టేశాడు. ఇప్పుడు 18 పేజీలు, కార్తికేయ 2 మూవీ షూటింగ్‌లతో బిజీగా ఉన్నాడు. తాజాగా కార్తికేయ 2 నుంచి వచ్చిన అప్డేట్‌తో మళ్లీ ఈ మూవీ ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఈ మూవీని ప్యాన్ ఇండియన్ లెవెల్‌లో తీసుకెళ్లే ఉద్దేశ్యంలో మేకర్స్ ఉన్నారని తెలుస్తోంది.

అందుకే బాలీవుడ్ ఫేమస్ నటుడు అనుపమ్ ఖేర్‌ని కార్తికేయ 2 కోసం తీసుకున్నారు. ధన్వంతరి పాత్రలో అనుపమ్ ఖేర్ కనిపించనున్నాడు. నేడు ఆయన బర్త్ డే సందర్భంగా ఈ అప్డేట్‌ను ప్రకటించారు. అభిషేక్ పిక్చర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీని చందూ మొండేటి తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రానికి కాళ భైరవ సంగీతాన్ని అందిస్తున్నాడు. కార్తీక్ ఘట్టమనేని కెమెరామెన్‌గా పని చేస్తున్నాడు.


Click it and Unblock the Notifications











