Tiger Nageswara Rao biopic టాలీవుడ్‌లోకి ప్రముఖ బాలీవుడ్ నటుడు.. రవితేజ మూవీలో కీలక పాత్ర
దేశంలోనే అత్యుత్తమ నటుడు అనుపమ్ ఖేర్ తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టబోతున్నారు. మాస్ మహారాజా నటిస్తున్న టైగర్ నాగేశ్వర్రావు చిత్రంలో కీలకపాత్రను పోషించడంతో ఆయన అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తున్నది. ఉగాది పర్వదినం రోజున మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ప్రారంభమైన ఈ చిత్రం తొలి రోజు నుంచే అంచనాలు పెంచేసింది. రవితేజ కెరీర్‌లో తొలి పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న చిత్రానికి వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. ది కశ్మీర్ ఫైల్స్ సినిమాతో విశేష అభిమానాన్ని సంపాదించకొన్న అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాను నిర్మించడం విశేషం. అయితే ఈ సినిమాలోని కీలక పాత్ర కోసం అనుపమ్ ఖేర్‌ను రంగంలోకి దించారు. దీంతో హిందీ మార్కెట్‌లో కూడా మంచి బజ్ ఏర్పడే అవకాశం కలిగింది.
వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న టైగర్ నాగేశ్వర్ రావు సినిమాను ఖర్చుకు వెనుకాడకుండా.. క్వాలిటీ విషయంలో రాజీ పడుకుండా అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నట్టు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది.స్టూవర్ట్ పురం గ్రామంలో70వ దశకంలో జరిగిన సంఘటనలు, ప్రముఖ దోపిడిదారుడు బయోపిక్‌గా టైగర్ నాగేశ్వరరావు సినిమా తెరకెక్కుతున్నది.

టైగర్ నాగేశ్వరరావు సినిమాలోని పాత్రకు తగినట్టుగా తన బాడీ లాంగ్వేజ్‌ను మార్చుకొని.. ఇంతకు ముందెన్నడూ కనిపించని పాత్రలో అభిమానులకు కొత్త అనుభూతిని కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారు. రవితేజ సరసన నూపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్నది.
నటీనటులు: రవితేజ, అనుపమ్ ఖేర్, నూపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ తదితరులు
రచన, డైరెక్షన్: వంశీ
నిర్మాత: అభిషేక్ అగర్వాల్
సమర్పణ: తేజ్ నారాయణ్ అగర్వాల్
సహ నిర్మాత: మయాంక్ సింఘానియా
డైలాగ్స్: శ్రీకాంత్ విస్సా
మ్యూజిక్ డైరెక్టర్: జీవీ ప్రకాశ్ కుమార్
సినిమాటోగ్రాఫర్: ఆర్ మాధి
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కోల్లా
పీఆర్వో: వంశీ శేఖర్


Click it and Unblock the Notifications











