బన్నీకి నేషనల్ అవార్డు.. అనుపమ్ ఖేర్ అసంతృప్తి.. తనకు వచ్చి ఉంటే బాగుండేదంటూ...!
69వ జాతీయ అవార్డుల విజేతలను కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 24 వ తేదీన సాయంత్రం లాంఛనంగా ప్రకటించింది. 2021కు గాను ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు సహా అనేక విభాగాల్లో అవార్డు విజేతలను వెల్లడించింది. అయితే అల్లు అర్జున్ కు బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అల్లు అర్జన్ కు అవార్డు రావడం పట్ల బాలీవుడ్ నటుడు కలత చెందాడా... అదే అని అర్ధం అవుతుంది. ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే....
69వ జాతీయ అవార్డుల విజేతలను కేంద్ర ప్రభుత్వం లాంఛనంగా ప్రకటించింది. ఇక ఈ అవార్డుల ప్రదానోత్సవంలో తెలుగు సినిమాలు హవా చూపించాయి. ముఖ్యంగా పుష్ప, ఆర్ఆర్ఆర్ సినిమాలు పోటా పోటీగా నిలిచాయి. ఇక 69 ఏళ్లలో తొలిసారిగా తెలుగు హీరోకు బెస్ట్ యాక్టర్ అవార్డు లభించింది. పుష్ప చిత్రానికి గానూ అల్లు అర్జున్ కు బెస్ట్ యాక్టర్ అవార్డు లభించింది.

అయితే అటు 'ది కశ్మీర్ ఫైల్స్' చిత్రానికి కూడా 69వ జాతీయ చలనచిత్ర అవార్డులలో రెండు అవార్డులు దక్కాయి. '69వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో 'ది కశ్మీర్ ఫైల్స్' చిత్రం రెండు అవార్డులు సొంతం చేసుకుంది. ఉత్తమ జాతీయ సమగ్రతా చిత్రం, అలాగే ఉత్తమ సహాయనటిగా పల్లవి జోషి అవార్డులు కైవసం చేసుకుంది. ఇక అదే సమయంలో, అల్లు అర్జున్ పుష్ప చిత్రానికి ఉత్తమ నటుడిగా నిలిచారు. ఉత్తమ నటి అవార్డును అలియా భట్ మరియు కృతి సనన్ పంచుకున్నారు.
విజేతలను ప్రకటించిన కొన్ని గంటల తర్వాత... ది కాశ్మీర్ ఫైల్స్ లీడ్ యాక్టర్ అనుపమ్ ఖేర్ విజయంపై తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. కానీ, ఈ సినిమాకు కూడా ఉత్తమ నటుడి అవార్డు వచ్చి ఉంటే బాగుండేదని అన్నారు. దీనితో నెటిజన్స్... అల్లు అర్జున్ కు బెస్ట్ యాక్టర్ అవార్డు రావడంతో అనుపమ్ ఖేర్ తీవ్ర అసంతృప్తికి గురైనట్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆయన చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.

అనుపమ్ ఖేర్ ట్వీట్ లో... ది కాశ్మీర్ ఫైల్స్ జాతీయ అవార్డును గెలుచుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇది గర్వించదగిన విషయం. ఈ చిత్రం జాతీయ సమగ్రతపై ఉత్తమ ఫీచర్ ఫిల్మ్‌గా నర్గీస్ దత్ అవార్డును అందుకుంది. నటుడిగానే కాకుండా ఎగ్జిక్యూటివ్‌గా కూడా.. ఈ చిత్ర నిర్మాతకు వచ్చిన గుర్తింపు పట్ల నేను సంతోషం వ్యక్తం చేస్తున్నాను... అంటూ రాసుకొచ్చారు.
ఇక కాశ్మీర్ ఫైల్స్ చిత్రంలో తన నటనకు కూడా అవార్డు వచ్చి ఉంటే తాను మరింత సంతోషించే వాడినని వెల్లడించారు. ఈ మాటతో అనుపమ్ ఖేర్ పై అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. మరోవైపు ఉత్తమ నటుడి అవార్డు విక్కీ కౌశల్ (సర్దార్ ఉద్దం) లేదా సూర్య (జై భీమ్)కి వచ్చి ఉండాలని మరో వర్గం భావిస్తుంది.


Click it and Unblock the Notifications











