DJ Tillu 2లో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్.. బర్త్ డే స్పెషల్ పోస్టర్ చూశారా?
అందం, అభినయంతో ఆకట్టుకునే బ్యూటిఫుల్ హీరోయిన్స్ లలో అనుపమ పరమేశ్వరన్ ఒకరు. కేరళకు చెందిన ఈ బ్యూటి తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకుంది. అలాగే తెలుగు సినీ ఇండస్ట్రీలోని ఉత్తమ నటీమణుల్లో ఒకరిగా వెలుగొందుతోంది. కార్తికేయ 2 సినిమాతో దేశవ్యాప్తంగా పాపులరైన ముద్దుగుమ్మ అనుపమ.. 18 పేజీస్, బటర్ ఫ్లై చిత్రాలతో ఆకట్టుకుంది. ఒకటి థియేటర్లో విడుదలైతే మరొకటి నేరుగా ఓటీటీలీ రిలీజై అలరించింది. అయితే సిద్ధు జొన్నలగడ్డ హిట్ మూవీ డీజే టిల్లు సీక్వెల్ చిత్రం డీజే టిల్లు 2లో హీరోయిన్ ఎవరా అనే క్వశ్చన్ చాలాకాలంగా వేధిస్తోంది. తాజాగా అందులో హీరోయిన్ అనుపమ పరమేశ్వరనే అంటూ ఆమె పుట్టినరోజు సందర్బంగా స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్.

బ్లాక్ బస్టర్ కావడంతో..
చిన్న సినిమాగా విడుదలైన డీజే టిల్లు ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాతో ఒక్కసారిగా సిద్ధు జొన్నలగడ్డ పేరు మారుమోగిపోయింది. ఎప్పటి నుంచే సినీ ఇండస్ట్రీలో ఉంటున్న సిద్ధుకి ఈ సినిమా సూపర్ క్రేజ్ తీసుకొచ్చింది. లైఫ్ బిఫోర్ వెడ్డింగ్, గుంటూరు టాకీస్, మా వింత గాధ వినుమా, కృష్ణ అండ్ హిజ్ లీల మూవీస్ తో ఆకట్టుకున్న సిద్ధు జొన్నల గడ్డ డీజే టిల్లుతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చాడు. సుమారు 12 ఏళ్ల తర్వాత సిద్ధుకు పూర్తి స్థాయిలో ఫేమ్ తీసుకొచ్చింది ఈ సినిమా. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తో సీక్వెల్ పై అంచనాలు పెరిగాయి.

నో చెప్పినట్లుగా టాక్..
అయితే డీజే టిల్లు సీక్వెల్ మూవీ నుంచి ఒక్కొక్కరు తప్పుకుంటూ షాక్ ల మీద షాక్ ఇచ్చారు. ముందుగా డైరెక్టర్ విమల్ కృష్ణ తప్పుకోగా.. ధమాకా హీరోయిన్ శ్రీ లీల కొద్ది రోజుల షూటింగ్ తర్వాత తప్పుకుందని వార్తలు వచ్చాయి. అనంతరం భీమ్లా నాయకు, సార్ బ్యూటి సంయుక్త మీనన్ ను డీజే టిల్లు 2 మేకర్స్ సంప్రదించగా ఆమె నో చెప్పినట్లు టాక్ నడిచింది. అనంతరం బ్యూటిఫుల్ కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ అని ప్రకటించారు.

రిలీజ్ ఎప్పుడంటే..
డీజే టిల్లు 2కోసం అనుపమ పరమేశ్వరన్ తో కొద్ది రోజులు షూటింగ్ జరిగింది. ఆ తర్వాత ఆ సినిమా నుంచి అనుపమ కూడా తప్పుకున్నట్లు వార్తలు తెగ హల్ చల్ చేశాయి. అంతేకాకుండా అలా ఒక్కొక్కరుగా తప్పుకోవడానికి సిద్ధు జొన్నలగడ్డే కారణం అని రూమర్స్ కూడా వచ్చాయి. అనేక రూమర్స్, వార్తలపై స్పందించిన సిద్ధు క్లారిటీ సైతం ఇచ్చాడు. డీజే టిల్లు 2ను 2023 మార్చిలో విడుదల చేస్తామని, రూమర్స్ రాసేవారికి రైటర్ గా మంచి భవిష్యత్తు ఉందని నిర్మాత నాగవంశీ కౌంటర్ ఇచ్చారు.

అనుపమ పుట్టినరోజు సందర్భంగా..
ఇక తాజాగా ఈ రూమర్స్ అన్నింటికి చెక్ పెడుతున్నట్లుగా డీజే టిల్లు 2లో హీరోయిన్ ఎవరనేది క్లారిటీ ఇచ్చేశారు. డీజే టిల్లు స్క్వేర్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ నటించనుంది. ప్రస్తతం సెట్స్ మీద ఉన్న ఈ సినిమాలో అనుపమ పాత్రకు సంబంధించిన పోస్టర్ విడుదల చేశారు. అయితే ఫిబ్రవరి 18 అనుపమ పరమేశ్వరన్ పుట్టినరోజు సందర్భంగా ఈ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్.
ముక్కుకు ముక్కెరతో..
డీజే టిల్లు స్క్వేర్ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఈ ఫొటోలో లూస్ హెయిర్ తో ముక్కుకు ముక్కెర పెట్టుకుని చాలా అందంగా కనిపించింది అనుపమ పరమేశ్వరన్. చూస్తుంటే డీజే టిల్లులోని రాధికను గుర్తుకు తెచ్చేలా ఉంది ఈ పోస్టర్. ఇదిలా ఉంటే ఈ సినిమాకు మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. 40 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











