twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బీహార్ అసెంబ్లీలో అనుపమ పరమేశ్వరన్ రచ్చ.. ఘాటుగా స్పందించిన తేజస్వి యాదవ్

    |

    ఆధార్ కార్డు, ఓటరు కార్డు, హాల్ టికెట్లపై ఇలా ఒకరి ఫోటోకు బదులుగా మరో ఫోటో రావడం చాలాసార్లు మన దృష్టికి వచ్చింది. ఇలాంటి తప్పులు దొర్లడం అప్పుడప్పుడు జరుగుతుంటాయి. తాజాగా బీహార్ విద్యాశాఖ నిర్వహించిన సెకండరీ టీచర్ ఎలిజిబిలిటి టెస్ట్, 2019 ఓ విద్యార్థి రిజల్ట్‌‌కు సంబంధించిన వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఈ వ్యవహారం బీహార్ అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షాల మధ్య భారీ గొడవకు, ఆరోపణలు, ప్రత్యారోపణలకు దారి తీసింది. ఈ వివాదానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

    హృషికేష్ కుమార్ అనే విద్యార్థికి సంబంధించిన ఉర్దూ, సంసృతి, సైన్స్ పేపర్లకు సంబంధించిన ఫలితాల్లో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఫోటో రావడం చర్చనీయాంశమైంది. అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల అలాంటి తప్పు దొర్లింది అని సెకండరీ టీచర్ ఎలిజిబిలిటి టెస్ట్ నిర్వాహకులు క్లారిటీ ఇచ్చారు.

    కానీ ఈ వ్యవహారంపై రచ్చ అసెంబ్లీలో ఘాటుగానే సాగింది. సెకండరీ టీచర్ ఎలిజిబిలిటి టెస్ట్‌కు సంబంధించిన విషయంలో భారీగా కుంభకోణాలు, అక్రమాలు చోటుచేసుకొన్నాయి అని బీహార్ ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ ఆరోపించారు. పరీక్షల నిర్వాహకుల తీరును బీహార్ అసెంబ్లీ ప్రశ్నించింది. లోపాలతో పరీక్షలు నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వాన్ని తూర్పార పట్టింది. అక్రమాలు జరగకుండా వెకెన్సీలను నింపాలని సూచించారు.

    Anupama Parameswaran hits in Bihar assembly: Tejashwi Yadav blasts State Government

    తేజస్వీ యాదవ్ ఆరోపణలపై బీహార్ ప్రభుత్వం తరఫున జేడీయూ నేత గులాం ఘాస్ స్పందిస్తూ.. ఇలాంటి చిన్న తప్పులు జరగడం సాధారణం. అలాంటి భూతద్దంలో పెట్టి చూపకండి అని అన్నారు. లోపాలను గుర్తించి అభ్యర్థులకు అన్యాయం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు.

    ఇదిలా ఉండగా, ఇలాంటి తప్పు జరగడం ఇదే మొదటిసారి కాదు. గతంలో రాష్ట్రస్థాయి బీహార్ పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్ నిర్వహించిన పోటీ పరీక్షల ఫలితాల్లో బాలీవుడ్ నటి సన్నీలియోన్ పేరుతో ఓ విద్యార్థి టాప్ ర్యాంకు సాధించడం చర్చనీయాంశమైంది.

    English summary
    South Actress Anupama Parameswaran hits in Bihar assembly: Tejashwi Yadav blasts State Government over her photo surfaced in Bihar's STET results
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X