స్టార్ క్రికెటర్‌తో అనుపమ పరమేశ్వరన్ పెళ్లి.. ఎప్పుడు.. ఎక్కడంటే?
ఇండియన్ టాప్ క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రాతో దక్షిణాది హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ డేటింగ్ వ్యవహారం మరోసారి మీడియాలో హైలెట్‌గా మారింది. ఇప్పటి వరకు వార్తలు అఫైర్‌కే పరిమితం కాగా, ప్రస్తుతం ఓ అడుగు ముందేసి అనుపమ పెళ్లి అంటూ హల్‌చల్ చేస్తున్నాయి. బూమ్రా ఇప్పటికే తన పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. ఆ వివారాల్లోకి వెళితే..

అనుపమ అఫైర్‌పై తల్లి రెస్పాన్స్
అప్పట్లో అనుపమ డేటింగ్ గురించి ఆమె తల్లి స్పందిస్తూ.. బూమ్రాతో అఫైర్ వార్తలు అవాస్తవం. వారిద్దరూ కేవలం స్నేహితులు మాత్రమే. అంతకంటే వారి మధ్య మరో బంధం లేదు. నా కూతురిని టార్గెట్‌గా చేసుకొని వస్తున్న వార్తలను మేము అంతగా పట్టించుకోం అని అన్నారు.

బూమ్రా, అనుపమ రిలేషన్‌పై రూమర్లు
ఇన్స్‌టాగ్రామ్‌లో జస్ప్రీత్ బూమ్రాను అనుపమ ఫాలో కావడంతో రూమర్లు మొదలయ్యాయి. వారి మధ్య ఘాటైన బంధం ఏర్పడింది. అయితే రూమర్లు వేగంగా వ్యాప్తి చెందుతున్న సమయంలో వారిద్దరూ ఇన్స్‌టాగ్రామ్‌లో అన్‌ఫాలో అయ్యారు. ఆ తర్వాత బూమ్రా ఉన్న హోటల్‌లోనే అనుపమ కూడా ఉండటంతో వారి మధ్య అఫైర్ గురించి వార్తలు మరింత పుంజుకొన్నాయి. అదే వారిద్దరూ కలుసుకోవడం తొలిసారి అని అనుపమ తల్లి వెల్లడించారు.

నిరాధరంగా వార్తలు రాయొద్దు
అనుపమ పరమేశ్వరన్, జస్ప్రీత్ బూమ్రా హోటల్‌లో కలిసిన తర్వాత నుంచి ప్రతీసారి ఏదో ఒక అంశం మీద వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే వాస్తవాలు లేకుండా అలాంటి వార్తలు ఎలా రాస్తారు. వాస్తవాలు తెలుసుకోకుండా ఎలా వార్తలు రాస్తారో అంటూ అనుపమ తల్లి వివరణ ఇచ్చారు. అయితే ప్రస్తుతం అనుపమ, బూమ్రా పెళ్లి ఖాయమనే వార్త మీడియాలో వినిపిస్తున్నాయి.

పెళ్లి కోసం నాలుగో టెస్టుకు దూరం?
ఇదిలా ఉండగా, ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్ నుంచి దూరం కావడంతో బూమ్రా పెళ్లి వార్తలు మరోసారి మీడియాలో గుప్పుమన్నాయి. తన పెళ్లి కోసం తనకు సెలవు కావాలని బీసీసీఐకి రిక్వెస్ట్ చేశారు. పెళ్లికి ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నాలుగో టెస్ట్ మ్యాచ్‌కు అందుబాటులో ఉండనని బూమ్రా స్పష్టం చేశారనేది తాజా సమాచారం. అయితే డేట్ ఇంకా అధికారికంగా డిసైడ్ కాలేదనేది తాజా సమాచారం.

అనుపమ పరమేశ్వరన్ కెరీర్ గురించి
ఇక అనుపమ పరమేశ్వరన్ కెరీర్ విషయానికి వస్తే.. తెలుగులో రాక్షసుడుతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం 18 పేజేస్ అనే తెలుగు చిత్రాల్లో నటిస్తున్నారు. మలయాళంలో మనియారేయిల్లే అశోకన్, ఫ్రీడమ్ మిడ్‌నైట్, థల్లి పొగతే చిత్రాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











