అంటే సుందరానికి సినిమాలో ఆ హీరోయిన్ స్పెషల్ ఎంట్రీ.. ఫ్యాన్స్ ఫిదా!

నేచురల్ స్టార్ నాని నటించిన అంటే సుందరానికి సినిమా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే నేచురల్ స్టార్ నాని నజ్రియా ఫాసిల్ జంటగా నటించిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించగా యువ దర్శకుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించాడు. బ్రోచేవారెవరురా సినిమాతో బాక్సాఫీసు వద్ద మంచి సక్సెస్ అందుకున్న ఈ దర్శకుడు ఈ సారి నానితో మరో విభిన్నమైన కామెడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

Recommended Video

Ante Sundaraniki Movie Genuine Review *Reviews | Telugu Filmibeat

తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అవుతుందని చిత్ర యూనిట్ సభ్యులు అయితే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. గురువారం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కూడా భారీ స్పందన లభించింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రత్యేక అతిధిగా రావటంతో ఒక్కరోజులోనే సినిమాకు పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అయ్యాయి. నేచురల్ స్టార్ నాని కి పవర్ స్టార్ అభిమానులు కూడా తోడవడంతో మొదటి రోజు సినిమా ఊహించిన దానికంటే ఎక్కువ స్థాయిలోనే కలెక్షన్స్ అందుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Anupama Parameswaran surprise role in Ante Sundaraniki movie

అయితే ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్ర హైలెట్ గా నిలిచినట్లు తెలుస్తోంది. ప్రత్యేకమైన అతిధి పాత్రలో కనిపించిన అనుపమ పరమేశ్వరన్ ఎంట్రీకి ఓ వర్గం ఆడియెన్స్ ను బాగానే ఎట్రాక్ట్ చేసినట్లు తెలుస్తోంది. సౌత్ ఇండస్ట్రీ లో మంచి హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న అనుపమ పరమేశ్వరన్ చివరగా రౌడీ బాయ్స్ సినిమాలో రొమాంటిక్ పాత్రలో షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఇక ఇప్పుడు అంటే సుందరానికి సినిమాలో నాని తో కలిసి ఒక సన్నివేశంలో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇక అందుకు సంబంధించిన ఈ సన్నివేశాల గురించి సోషల్ మీడియాలో ప్రేక్షకులు కూడా మాట్లాడుకుంటున్నారు. అనుపమ పరమేశ్వరన్ టైమింగ్ కూడా అద్భుతంగా ఉంది అని చెబుతున్నారు. ఇక అంటే సుమదరానికి బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు కలెక్షన్స్ గట్టిగానే వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ సినిమా 28 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. మరి ఫైనల్ గా నిర్మాతలకు ఏ స్థాయిలో లాభాలు అందిస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X