నటి అనుపమ సూసైడ్.. ఎవ్వరినీ నమ్మెద్దు అంటూ మరణానికి ముందు వీడియో

భోజ్‌పురి నటి అనుపమ పాథక్ అనుమానాస్పద పరిస్థితుల్లో ఆగస్టు 2వ తేదీన ఆత్మహత్య చేసుకొన్నారు. అయితే తను కొందరు దారుణంగా చీటింగ్ చేశారు. ఇక ముందు ఎవరినీ నమ్మవద్దు అంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. తనను మోసగించారంటూ మరణానికి ముందు రాసిన సూసైడ్‌ను స్వాధీనం చేసుకొని ముంబై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అనుపమ పాథక్ ఆగస్టు 2వ తేదీన నార్త్ ముంబైలోని దాహిసార్ నగర శివారులోని తన నివాసం సూసైడ్ చేసుకొన్నారు. ఆమె బీహార్‌లోని పుర్నియాకు చెందిన వారు. భోజ్‌పురి చిత్రాల్లో నటించడం కోసం ఆమె ముంబైకి తన మకాం మార్చారు.

Anupama Pathak Suicide: Facebook video of before death goes viral

అనుపమ పాథక్ మరణానికి కారణం ఏమిటంటే.. ముంబై మల్లాడ్‌లోని విజ్డమ్ ప్రొడ్యూసర్ కంపెనీ చీటింగ్‌కు పాల్పడిందని అనుపమ పాథక్ ఆరోపించారు. తాను పెట్టుబడి పెట్టిన రూ.10 వేల రూపాయలను గడువు తీరిన తర్వాత కూడా ఇవ్వలేదనే ఆరోపణలు ఆమె చేశారు.

తన మరణానికి ముందు వీడియోలో.. ఎవరైనా పీకల్లోతు సమస్యలతో ఆత్మహత్య చేసుకొనేంత పరిస్థితుల్లో ఉంటే.. ఎలాంటి స్థితిలోనైనా దయ చూపుతారు. వారి మరణం తర్వాత తాము ఇబ్బందుల్లో పడొద్దని భావిస్తారు. కానీ కొందరు మాత్రం ఎదుటి వారి ముందు కించపరిచేలా అవమానిస్తూ అవహేళన చేస్తారు. అలాంటి వారిని మనం ఫ్రెండ్‌గా ఎట్టి పరిస్థితుల్లోనే భావించొద్దు. జీవితంలో మరొకరిన నమ్మొద్దని నేను నేర్చుకొన్నాను. మన చుట్టూ ఉండే జనమంతా స్వార్ధపరులు. అలాంటి వారిని దరిదాపుల్లోకి రానివ్వ వద్దు అంటూ అనుపమ పాథక్ ఫేస్‌బుక్‌లో పోస్టు చేసిన వీడియోలో ఆవేదనను వ్యక్తం చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X