ఏడేళ్ల క్రితం నా జీవితం సర్వనాశనం.. ఏడేళ్ల శని పీడ విరుగడ కానుంది!
బాలీవుడ్‌లో అనురాగ్ కశ్యప్ రూపొందించిన గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్ చిత్రం విడుదలై జూన్ 22 తేదీకి ఏడేళ్లు పూర్తి చేసుకొన్నది. ఈచిత్రం రెండుభాగాలు విడుదలై సంచలనం రేపింది. బొగ్గు గనుల మాఫియా, రెండు వర్గాల మధ్య ఆధిపత్య ఘర్షణ చుట్టు తిరిగే కథ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచింది. ఈ చిత్రం ఏడేళ్లు పూర్తి చేసుకొన్న నేపథ్యంలో అనురాగ్ కశ్యప్ భిన్నంగా స్పందించారు.
ఏడేళ్ల క్రితం నా జీవితం నాశనమైంది. గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్ రిలీజ్ తర్వాత పదే పదే అవే చిత్రాలు చేయాలని ఒత్తిడి తెచ్చారు. ఆ సినిమా పెంచిన అంచనాలతో నేను సక్సెస్ కాలేకపోయాను. 2019 ముగింపు నాటికి నాకు ఏడేళ్ల శని పీడ విరుగడై పోతుంది అని అనురాగ్ కశ్యప్ ట్వీట్ చేశారు.

గ్యాంగ్స్ వాస్సేపూర్ చిత్రం వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. నాటుగా, వాస్తవికత ఉట్టిపడే విధంగా రూపొందించిన ఈ చిత్రం తొలి వారేమే రూ. 10 కోట్లు వసూలు చేయడం అప్పట్లో ఓ సంచలనం.
ధన్‌బాద్, జార్ఖండ్‌లోని వాస్సేపూర్ ప్రాంతం వేదికగా గ్యాంగస్టర్ సినిమా రూపొందిద్దుకొన్నది. మనోజ్ బాజ్‌పేయ్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, పియూష్ మిశ్రా, రిచా చద్దా తదితరులు నటించారు. ఇక అనురాగ్ కశ్యప్ కెరీర్ విషయానికి వస్తే.. బ్లాక్ ఫ్రైడే, దేవ్ డీ, గులాల్, అగ్లీ, రామన్ రాఘవ్, ముక్కాబాజ్,మన్మర్జియాన్ చిత్రాలకు దర్శకత్వం వహించారు.


Click it and Unblock the Notifications











