స్వప్రయోజనాల కోసమే పాయల్ ఘోష్ ఆరోపణలు.. అనురాగ్ లాయర్ నోటీసు

బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌పై హీరోయిన్ పాయల్ ఘోష్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. అయితే తనపై వచ్చిన ఆరోపణలను అనురాగ్ కశ్యప్ సోషల్ మీడియా ద్వారా ఖండించారు. తనపై చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. తనను నోరు మూయించడానికి చేసిన కుట్రగా అభివర్ణించారు. నా నోరు మూయించే ప్రయత్నంలో కొందరు మహిళల పేర్లు ఎత్తుకోవడం బాధగా ఉంది అని అన్నారు. తాజాగా మరోసారి తన లాయర్ చేత ఓ ప్రకటనను రిలీజ్ చేయించారు. ఆ ప్రకటనను తన ట్విట్టర్‌ ద్వారా షేర్ చేశారు.

Recommended Video

#PayalGhosh : Anurag Kashyap Responds To Payal Ghosh's Comments || Oneindia Telugu

అనురాగ్ కశ్యప్ లాయర్ ప్రియాంక ఖిమానీ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. నా క్లయింట్‌పై ఓ నటి చేసిన లైంగిక దాడి ఆరోపణలతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఆయనపై చేసిన కామెంట్స్ అన్నీ అవాస్తవాలే. తన ప్రతిష్టకు భంగం కలిగించేలా ఆరోపణలు చేశారు. మీటూ ఉద్యమాన్ని స్వప్రయోజనాలకు వాడుకొంటుకొన్నారు. కొందరి వ్యక్తిగత జీవితాలను నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు అంటూ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Anurag Kashyaps lawyer releases statemet over Payal Ghosh allegations

హీరోయిన్ పాయల్ ఘోష్‌ ఆరోపణలను ఖండిస్తూ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌కు కొందరు బాలీవుడ్ ప్రముఖులు మద్దతుగా నిలిచారు. హన్సల్ మెహతా, తాప్సీ పన్ను, మహ్మద్ జీషన్ అయ్యుబ్, రాధిక ఆప్టే, తాప్సీ లాంటి బాలీవుడ్ ప్రముఖులతోపాటు అనురాగ్ మాజీ భార్య ఆర్తీ బజాజ్ అండగా నిలిచారు. అనురాగ్ వద్ద ఎలాంటి భయాందోళనలు, వేధింపులు లేకుండా మహిళలు పనిచేసుకోవచ్చు అంటూ మద్దతుగా నిలిచారు.

ఇదిలా ఉండగా, ట్విట్టర్‌లో అనురాగ్ కశ్యప్‌పై పాయల్ ఘోష్ చేసిన ఆరోపణలపై జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. పూర్తి వివరాలతో కూడిన ఫిర్యాదును అందజేయాలని కోరింది. అనురాగ్ కశ్యప్ తనపై లైంగిక దాడి చేశాడంటూ ప్రధాని మోదీ, పీఎంవోకు పాయల్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X