అనుష్క ప్రాజెక్ట్ ఆగిపోలేదు.. మహేష్ బాబు దర్శకత్వలోనే డిఫరెంట్ లవ్ స్టొరీ!

టాలీవుడ్ స్టార్ నటి అనుష్క శెట్టి చివరిగా నిశ్శబ్దం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. హేమంత మధుకర్ తీసిన ఈ థ్రిల్లర్ సినిమా, ఆడియన్స్ ని పెద్దగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. అనంతరం కెరీర్ పరంగా కొంత గ్యాప్ తీసుకున్న అనుష్క, నేడు తన పుట్టినరోజు సందర్భంగా కొత్త మూవీ అనౌన్స్ మెంట్ చేసారు. యువి క్రియేషన్స్ బ్యానర్ పై యువ దర్శకుడు మహేష్ బాబు తీయనున్న ఈ సినిమా త్వరలో పట్టాలెక్కనుంది. యువి క్రియేషన్స్ బ్యానర్ లో గతంలో ప్రభాస్ తో మిర్చి తో పాటు ఇటీవల లేడీ ఓరియెంటెడ్ మూవీ భాగమతి ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్స్ కొట్టారు అనుష్క.

పుట్టినరోజు వేడుకలు ఫ్యామిలీతో

పుట్టినరోజు వేడుకలు ఫ్యామిలీతో

తొలి సినిమా సూపర్ నుండి ఒక్కొక్కటిగా తన టాలెంట్ తో అవకాశాలు అందుకుంటూ ఆపైన అనేక సక్సెస్ లు సొంతం చేసుకున్న స్టార్ నటి అనుష్క శెట్టి, అటు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఫ్యాన్స్ తో ఎప్పుడూ టచ్ లో ఉంటూ ఉంటారు. తన సినిమాలు, వ్యక్తిగత లైఫ్ గురించి వారితో పంచుకుంటూ ఉండే అనుష్క, కొన్నాళ్లుగా ఫ్యాన్స్ తన లేటెస్ట్ మూవీ కోసం ఎదురుచూస్తున్నారని తెలుసుకుని వారిని కొంత వెయిట్ చేయమని కోరారు.

ఇక నేడు ఆమె న్యూ మూవీ అనౌన్స్ మెంట్ రావడంతో ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయారు. మొదటి నుండి తనకు బర్త్ డే పెద్దగా గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకునే అలవాటే లేదని చెప్తూ ఉండే అనుష్క, నేది తన వేడుకలు ఫ్యామిలీ సమక్షంలో ఎంతో సాదాసీదాగా జరుగనున్నాయని చెప్పారు.

అరుంధతి తో అద్భుత గుర్తింపు

అరుంధతి తో అద్భుత గుర్తింపు

తొలిసారిగా పూరి జగన్నాథ్ తీసిన సూపర్ సినిమా ద్వారా టాలీవుడ్ కి పరిచయమైన బెంగళూరు కి చెందిన అనుష్క శెట్టి, ఆ మూవీలో షాషా క్యారెక్టర్ లో కనిపించారు. ఆ తరువాత అవకాశాలు అందుకున్న అనుష్కకి అప్పటి దివంగత సీనియర్ డైరెక్టర్ కోడి రామకృష్ణ అరుంధతి మూవీ స్టోరీ చెప్పడం జరిగింది. నిజానికి కథ ఎంతో బాగా నచ్చినప్పటికీ, ఆ క్యారెక్టర్ పోషించాలంటే గట్స్ కావాలని, తాను ఆ క్యరెక్టర్ కి సెట్ కానని భావించిన అనుష్కకి కొన్నాళ్ళ విరామం తరువాత ఫైనల్ గా మూవీ చేసారు.

భారీ హంగులతో హర్రర్ తో కూడిన థ్రిల్లర్ గా తెరకెక్కిన అరుంధతి విడుదల తరువాత అతి పెద్ద విజయం సాధించి టాలీవుడ్ లో అనుష్క కి స్టార్ హీరోయిన్ స్టేటస్ తెచ్చిపెట్టింది. ఆ సినిమాలో ఆమె చేసిన రెండు పాత్రలకి ఆడియన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

సామజిక సేవలోను ముందే

మొదటి నుండి కూడా తన సినిమాలకు పనిచేసే నటీనటులు అలానే ఇతర బృందం తో కూడా ఎంతో కలుపుగోలుగా ఉండే అనుష్క, ఎంత ఎదిగినప్పటికీ కూడా ఒదిగిపోయి ఉంటారని పలువురు చెప్తూ ఉంటారు. అలానే తన వద్దకు సహాయం కోసం వచ్చిన వారికి లేదనుకుండా సాయం చేసే మంచి అలవాటు గల అనుష్క, మధ్యలో పలువురు తన వద్ద పనిచ్ చేసే వారికి సైతం ఆర్ధికంగా సహాయం చేసి తన గొప్ప మనసు చాటుకున్నారు.

Recommended Video

Thamasoma Jyothirgamaya Movie Team Chit Chat | Handlooms
అనుష్క 48వ సినిమా

అనుష్క 48వ సినిమా

అలానే పలు ఇతర సామజిక సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొనే అలవాటు గల అనుష్క, మన దగ్గర ఉన్నంతలో సాయం చేయడం వలన మన చుట్టూ ఉన్న వారు కూడా ఆనందం పొందుతారని, అయినా దానివలన మనకు వచ్చే నష్టం ఏమి లేదని అంటారు. ఇక యూవీ క్రియేషన్స్ లో రూపొందుతున్న అనుష్క 48వ సినిమాను దర్శకుడు డిఫరెంట్ లవ్ స్టొరీగా తెరకెక్కించనున్నాడు. మొదట ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినట్లు టాక్ వచ్చింది. ఇక ఇప్పుడు అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X