twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఓటీటీలోనే విడుదలకు సిద్దమైన అనుష్క నిశ్శబ్దం.. అమెజాన్ రేటుకు నిర్మాతలు హ్యాపీ

    |

    బాహుబలి అనంతరం అనుష్క కూడా హీరోల మాదిరిగానే ఏడాదికోసారి మెరుపు తిగలా కనిపించి వెళుతోంది. బాహుబలి తరువాత భాగమతి సినిమాతో మరో సోలో బాక్సాఫీస్ హిట్టు కొట్టిన జేజమ్మ గత ఏడాది సైరా సినిమాలో ఒక స్పెషల్ పాత్రలో మెరిసింది. ఇక ఫైనల్ గా అమ్మడి నుంచి చాలా రోజుల తరువాత ఒక లేడి ఓరియెంటెడ్ సినిమా రాబోతోంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన నిశ్శబ్దం సినిమా విడుదల తేదీ ఎట్టకేలకు ఖరారైంది.

     ఎప్పుడో రావాల్సిన నిశ్శబ్దం..

    ఎప్పుడో రావాల్సిన నిశ్శబ్దం..

    హేమంత్ మధుకర్ దర్శకత్వంలో కోన వెంకట్ నిర్మించిన నిశ్శబ్దం సినిమాను ఈ ఏడాది మొదట్లోనే రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ లాక్ డౌన్ వలన వర్కౌట్ కాలేదు. ఏప్రిల్ 2న గ్రాండ్ గా విడుదల చేయాలని ఎన్నో ఆశలు పెట్టుకున్న చిత్ర యూనిట్ కి కరోనా పెద్ద షాక్ ఇచ్చిందనే చెప్పాలి. ఇక ఫైనల్ గా ఓటీటీలో రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు.

    ఆలస్యం చేస్తే నష్టాలు తప్పవని

    ఆలస్యం చేస్తే నష్టాలు తప్పవని

    మొదట్లో ఈ సినిమా ఓటీటీలో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదు. ఎలాగైనా థియేటర్స్ ఓపెన్ అయిన తరువాతే విడుదల చేయాలని అనుకున్నారు. కానీ వర్కౌట్ కాలేదు. ఇక ఆలస్యం చేస్తే నష్టాలు తప్పవని గ్రహించని చిత్ర యూనిట్ ఫైనల్ గా అమెజాన్ ప్రైమ్ ఇచ్చిన ఆఫర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

    20కోట్లకు పైగా ఓటీటీ రైట్స్..

    20కోట్లకు పైగా ఓటీటీ రైట్స్..

    గత రెండు వారాలుగా నిశ్శబ్దం చిత్ర నిర్మాతలు అమెజాన్ ప్రైమ్ డీలింగ్స్ పై చర్చలు జరుపుతున్నారు. ఇక ఫైనల్ గా 20కోట్లకు పైగా ఓటీటీ రైట్స్ ని అమ్మినట్లు తెలుస్తోంది. ఈ రేటుతో చిత్ర నిర్మాతలు సంతృప్తి చెందినట్లు సమాచారం. అనుష్క కెరీర్ లో ఇదొక సరికొత్త రికార్డ్ అనే చెప్పాలి.

    Recommended Video

    Sushant Singh Rajput’s గర్ల్ ఫ్రెండ్ Rhea Chakraborty To Be Qestioned By పోలీస్
    అక్టోబర్ 2న ఐదు భాషల్లో

    అక్టోబర్ 2న ఐదు భాషల్లో

    ఓటీటీ రైట్స్ అనే కాకుండా శాటిలైట్ రైట్స్ కూడా మిగిలి ఉన్నాయి కాబట్టి చిత్ర నిర్మాతలు మరింత లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఇక ఫైనల్ గా అక్టోబర్ 2న తెలుగులోనే కాకుండా కన్నడ, హిందీ, తమిళ్, మలయాళ భాషల్లో సినిమాను ఒకేసారి విడుదల చేయనున్నారు. ఈ మధ్య కాలంలో ఓటీటీలో వచ్చిన కొత్త సినిమాలు పెద్దగా సంతృప్తి పరచలేకపోయాయి. మరి అనుష్క ఎంతవరకు కిక్కిస్తుందో చూడాలి.

    English summary
    The post-production work is yet to be postponed due to release in February in four languages. Due to Corona Lockdown, the theater closes for another two months and should not wait. It is not known what the conditions will be even after two months. That is why there was talk of Chance releasing the film on Digital World.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X