ఎట్టకేలకు అనుష్క నిశ్శబ్దం రాబోతోంది.. రిలీజ్ డేట్ ఫిక్స్
బాహుబలి సినిమాల తరువాత అనుష్క క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అప్పటికే లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన అనుష్క.. బాహుబలితో దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకుంది. చివరగా భాగమతి అనే ఓ హారర్ చిత్రంతో వచ్చింది. అయితే మళ్లీ ఇంత వరకు వెండితెరపై కనిపించలేదు స్వీటీ. త్వరలోనే తన అభిమానులను పలకరించేందుకు సిద్దమవుతోంది అనుష్క.
కోన ఫిల్మ్ ఫ్యాక్టరీ, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న బహుభాషా చిత్రం నిశ్శబ్దం. ఇంగ్లీష్ భాషలోనూ ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. హాలీవుడ్ టెక్నీషియన్స్, నటులు పని చేస్తోన్న మొట్టమొదటి తెలుగు చిత్రమిదేనని కోన వెంకట్ అప్పట్లో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మాధవన్, అంజలి, సుబ్బరాజు వంటివారు ప్రత్యేక పాత్రలను పోషిస్తున్న సంగతి తెలిసిందే.

మామూలుగా అయితే ఈ పాటికే సినిమా విడుదలై ఏదో ఒక ఫలితం వచ్చి ఉండేది. జనవరి 31న విడుదల కావాల్సిన నిశ్శబ్దం కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. తాజాగా ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ఏప్రిల్ 2న ఈ సినిమాను విడుదల చేయబోతోన్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్స్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. మరి ఈ సినిమా ప్రేక్షకులకు ఎలాంటి థ్రిల్‌ను కలిగిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











