ప్రియాంక రెడ్డి హత్య : మానవత్వం చచ్చిపోతోంది.. మహిళగా పుట్టడమే నేరమా?

డాక్టర్ ప్రియాంక రెడ్డి దారుణ హత్యపై ఆగ్రహజ్వాలలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. ఈ దారుణానికి ఒడిగట్టిన వారిని ఉరి తీయాలంటూ ముక్తకంఠంతో నినాదాలు చేస్తున్నారు. సినీ రాజకీయ ప్రముఖులే కాదు మహిళా సంఘాలు, సామాజిక కార్యకర్తలు, విద్యార్థి సంఘాలు ఇలా సమాజం అంతా ఒక్క తాటిపైకి వచ్చి.. నిందుతులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో అనేక సినీ ప్రముఖులు ఈ ఘటనపై స్పందిస్తుండగా అనుష్క, మంచు లక్ష్మీ వంటి వారు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.

మానవత్వం చచ్చిపోతోంది..

నాకు మాటలు రావడం లేదు.. కానీ కచ్చితంగా ఇప్పుడిది చెప్పాలి.. మానవత్వం అనేది చచ్చిపోతోంది.. ప్రభుత్వాలు, పోలీసులు కాదిక్కడ మానవత్వమనేది లేకుండా పోతోంది. ఇలాంటి రాక్షసుల మూలానా ఎంతో మంది బలైవుతున్నారు.. ప్రియాంక రెడ్డి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.

మహిళగా పుట్టడమే నేరమా

మహిళగా పుట్టడమే నేరమా

ప్రియాంక రెడ్డి ఘటనపై అనుష్క స్పందిస్తూ.. సమాజంలో మహిళగా పుట్టడమే నేరమా? అని ఆమె ప్రశ్నించారు. ఇలాంటి దారుణాలకు పాల్పడిన వారిని జంతువులతో పోలిస్తే... అవి కూడా సిగ్గుపడతాయని అన్నారు. అమాయకురాలైన ప్రియాంక రెడ్డిని అత్యాచారం చేసి చంపేశారని... ఇది మొత్తం మానవాళిని కదిలించే విషాదకరమైన ఘటన అని చెప్పారు. ఈ దారుణానికి ఒడిగట్టిన వారికి వెంటనే శిక్ష పడే విధంగా మనందరం కలిసి పోరాడుదామని పిలుపునిచ్చారు.

నా హృదయం ముక్కలైంది..

హైదరాబాద్‌లో జరిగిన సంఘటన విని నా హృదయం ముక్కలైంది. ఇది అత్యంత బాధాకరమైన విషయం. ఇలాంటి వాటికి పూర్తిగా అంతమొందించాలంటే ఎన్నో మార్పులు రావాలి. ఇలాంటివెప్పుడు అంతమవుతాయి? అంటూ ప్రశ్నించింది.

Recommended Video

Arjun Suravaram Movie Review | Samantha In Family Man Season 2

ఇదే సరైన సమయం

మనే దేశంలో చదువంటే కేవలం డిగ్రీలు, జాబ్ సంపాదించడమే.. జీవితాన్ని నేర్పడమే నిజమైన చదువని తెలుసుకోవడానికి ఇదే సరైన సమయం.. ట్రాఫిక్ రూల్స్, ఆడవారిని గౌరవించడం, ఎదుటివారికి మర్యాద ఇవ్వడం లాంటివి పిల్లలకు నేర్పాలి.. నా హృదయం నుంచి రక్తం కారుతోంది.. ప్రియాంక రెడ్డి వార్త విన్న తరువాత.. మార్పు అనేది కింది స్థాయి నుంచి రావాలి అంటూ ఆవేదన చెందింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X