‘సైలెన్స్’ షూటింగ్ షురూ... అనుష్క పాత్ర ఇదేనా?

సౌత్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి అభిమానులంతా ఆమె నెక్ట్స్ మూవీ కోసం చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు. సంవత్సరన్నర గ్యాప్ తర్వాత ఎట్టకేలకు అనుష్క సినిమా ప్రారంభం అయింది. ప్రస్తుతం ఆమె 'సైలెన్స్' అనే హారర్ థ్రిల్లర్‌లో చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ మే 25న అమెరికాలోని సీటెల్‌లో ప్రారంభం అయింది.

ఈ మూవీ ద్వారా హేమంత్ మధుకర్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో అనుష్క కళలను ఇష్టపడే వ్యక్తిగా కనిపించబోతోందట. ప్రముఖ నటుడు మాధవన్ వయొలిన్ వాద్యకారుడిగా నటిస్తున్నాడు.

అనుష్క, మాధవన్ మధ్య ఎలాంటి రొమాంటిక్ ట్రాక్ ఉండదట. ఇంకా అంజలి, సుబ్బరాజు, శాలిని పాండే, శ్రీనివాస్ అవసరాల ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే హాలీవుడ్ నటుడు మైఖేల్ మాడ్సేన్ కీలకమైన పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఎక్కువ శాతం షూటింగ్ అమెరికాలోనే జరిపేందుకు ప్లాన్ చేశారు.

 Anushka’s horror thriller Silence shooting start

సినిమా కోసం అనుష్క స్లిమ్ లుక్‌లోకి మారింది. బరువు తగ్గం కోసమే ఆమె సంవత్సరకాలం సమయం తీసుకుంది. 'సైలెన్స్' చిత్రాన్ని కోన వెంకట్, టిజి విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించబోతున్నారు. గోపీ సుందర్ ఈ చిత్రానికి సంగీతం అందింస్తున్నారు.

'బాహుబలి' ప్రాజెక్ట్ తర్వాత అనుష్క సినిమాలు చేయడం తగ్గించేశారు. ఆమె నటించిన చివరి చిత్రం 'భాగమతి' 2018 ప్రారంభంలో విడుదలైంది. తాజాగా మొదలైన 'సైలెన్స్' చిత్రం 2020లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X