తల్లి కాబోతున్న అనుష్క శర్మ: ఓ మై గాడ్ అంటూ రకుల్, కాజల్, సమంత విషెస్
బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ, భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి దంపతులు త్వరలోనే ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నది. సాధారణ నెటిజన్లతోపాటు క్రికెట్, సినీ రంగాలకు సంబంధించిన ప్రముఖులు విరుష్కకు అభినందనలు తెలుపుతూ సందేశాలు పంపుతున్నారు. విరుష్కకు దంపతులకు సమంత అక్కినేని, కాజల్, పూజా హెగ్డే, రకుల్ ప్రీత్ సింగ్ విషెస్ తెలియజేస్తూ ఏమన్నారంటే..

శుభవార్తతో అనుష్క, విరాట్ దంపతులు
అనుష్క శర్మ ప్రెగ్నెంట్ అనే విషయాన్ని విరాట్ కోహ్లీ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇప్పుడు మేమిద్దరం. త్వరలోనే ముగ్గురం కాబోతున్నాం. మా ఇంట్లోకి చిన్నారి జనవరి 2021లో అడుగుపెట్టబోతున్నాడు అంటూ తన సంతోష క్షణాలను విరాట్, అనుష్క తమ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా ప్రకటించారు.

సోషల్ మీడియాలో ఫోటో పోస్టు చేసి..
విరాట్, అనుష్క దంపతులు సంతోష క్షణాలను ఆస్వాదిస్తున్న ఫోటోను వారు తమ ట్విట్టర్, ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్లలో షేర్ చేశారు. విరుష్క గర్బవతి అనే విధంగా బేబీ బంప్‌తో కనిపిస్తున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దాంతో విరాట్, అనుష్క శర్మ ఆనందంలో సెలబ్రిటీలు, నెటిజన్లు భాగమయ్యారు.

బాలీవుడ్, టాలీవుడ్ తారల అభినందనల వెల్లువ
అనుష్క శర్మ తన ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు పెట్టగానే సమంత అక్కినేని, కుష్బూ సుందర్, కాజల్ అగర్వాల్, అలియాభట్, పూజా హెగ్డే, కియారా అద్వానీ, పరిణితి చోప్రా, రకుల్ ప్రీత్ సింగ్, వరుణ్ ధావన్, తాప్సీ పన్ను, ప్రియాంక చోప్రా లాంటి తారలు ఇన్స్‌టాగ్రామ్‌లో స్పందిస్తూ కంగ్రాట్స్ తెలిపారు.
Recommended Video

రకుల్ ప్రీత్ మరింత ఉత్సాహంతో
అనుష్క శర్మ దంపతులకు కాజల్ అగర్వాల్ విషెస్ తెలియజేస్తూ.. కంగ్రాచులేషన్స్.. మీ ఇద్దరికి ప్రేమతో కూడిన అభినందనలు అంటూ రిప్లై ఇచ్చారు. సమంత కంగ్రాట్స్ అంటూ సింపులు విష్ చేశారు. రకుల్ ప్రీత్ మరింత ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ ఓ మై గాడ్.. కంగ్రాట్స్ అంటూ విషెస్ అందజేశారు. ట్విట్టర్ ద్వారా మనీషా కోయిరాలా అనుష్కకు అభినందనలు తెలిపారు.


Click it and Unblock the Notifications











