రేప్ చేసి తల నరికారు.. కోపాన్ని ఆపుకోలేకపోయిన అనుష్క శర్మ

సమాజంలో మహిళలపై జరుగుతున్న అరాచకాలు, చిన్నారులపై జరుగుతున్న లైగింక దాడులు నానాటికీ పెరిగిపోతున్నాయి. వీటిపై ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కీచకుల పర్వాలు ఆగటం లేదు. కొన్ని హృదయ విషాదకర సంఘటనలు సభ్య సమాజమే తలదించుకునే విధంగా ఉంటున్నాయి. ఇలాంటి ఓ విషాదకర ఘటన జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై తాజాగా స్పందించిన హీరోయిన్ అనుష్క తన కోపాన్ని వ్యక్తం చేసింది.

జులై 25 వ తేదీన జంషెడ్‌పూర్‌లోని టాటానగర్ రైల్వే స్టేషన్‌లో తల్లిదండ్రుల పక్కన నిద్రించిన మూడేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసిన దుండగులు.. ఆ చిన్నారిపై అతి కిరాతకంగా లైంగిక దాడికి పాల్పడి, చివరకు తల నరికేసి చంపేశారు. రెండు రోజుల క్రితమే టెల్కో పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఆ చిన్నారి మృతదేహం లభ్యమైంది. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు కేసుపై తదుపరి విచారణ చేపడుతున్నారు. దేశాన్నే తీవ్రంగా కలిచి వేసిన ఈ దుర్ఘటనపై తాజాగా అనుష్క శర్మ స్పందిస్తూ ట్వీట్ చేసింది.

 Anushka Sharma Reacts On 3 Year Child Incident

మూడేళ్ళ చిన్నారిపై జరిగిన ఈ హత్యాచారం అత్యంత అమానవీయమైన ఘటన అని, ఈ విషయం వింటుంటేనే పట్టరాని కోపంతో ఊగిపోతున్నానని అనుష్క శర్మ తన ట్వీట్ లో పేర్కొంది. మరొకరు ఇలాంటి చర్యలకు పాల్పడకుండా ఉండాలంటే నిందితులను కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేసింది. ఈ ఘటనలో బాధితులకు సత్వర న్యాయం జరగాలని, నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టవద్దని పేర్కొంటూ వరుస ట్వీట్స్ చేసింది అనుష్క శర్మ. ఇక ఇటీవలే తన ప్రెగ్నెన్సీపై వస్తున్న రూమర్స్ ని ఖండిస్తూ అనుష్క ఫైర్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈమె సినిమాలకు స్మాల్ బ్రేక్ ఇచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X