twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రభాస్‌ను వదులుకోలేను.. నిజం బయట పెట్టేసిన అనుష్క

    |

    ప్రభాస్-అనుష్క వ్యవహారం ఇప్పటిది కాదు.. గత కొన్నేళ్ల నుంచి నానుతూనే వస్తోంది. ఇద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతోన్నారని వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇంకా అలాంటి వార్తలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఆ వార్తల సంగతి ఏమైనా సరే గానీ వీరిద్దరిని మాత్రం అభిమానులు ఆరాధిస్తూనే ఉంటారు. ముఖ్యంగా వీరిద్దరి జంటకు కూడా భారీ క్రేజ్ ఉంది.

    ఎప్పుడూ హాట్ టాపిక్కే..

    ఎప్పుడూ హాట్ టాపిక్కే..

    డార్లింగ్, స్వీటి కలిసి నటించిన చిత్రాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్సే. బిల్లా, మిర్చి, బాహుబలి వంటి చిత్రాలతో అభిమానులను అలరించారు. అయితే అనుష్క పెళ్లి, ప్రభాస్ పెళ్లి, అనుష్క-ప్రభాస్ పెళ్లి అనేవి ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే ఉంటాయి.

    పుకార్లు మాత్రం..

    పుకార్లు మాత్రం..

    తామిద్దరం మంచి స్నేహితులమేనని ఎన్ని సార్లు చెప్పినా.. అలాంటి పుకార్లు మాత్రమే వస్తూనే ఉన్నాయి. ఈ ఇద్దరు కలిసి ఎక్కడైనా కనిపించినా, ఈవెంట్స్‌లో పాల్గొన్నా పెళ్లి అనే టాపిక్ మాత్రం మళ్లీ పైకి వస్తుంది. తాజాగా మరో సారి అనుష్క చేసిన కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి.

    ప్రమోషన్స్‌లో భాగంగా..

    ప్రమోషన్స్‌లో భాగంగా..

    నిశ్శబ్దం ప్రమోషన్స్‌లో భాగంగా క్యాష్ ప్రోగ్రామ్‌కు యూనిట్ ముఖ్య అతిథిగా విచ్చేసింది. ఇందులో సుబ్బరాజు, అనుష్క, హేమంత్ మధుకర్, అవసరాల శ్రీనివాస్ ఉన్నారు. అయితే షోలో భాగంగా సుమ ఓ క్లిష్టమైన ప్రశ్నను సంధించింది.

    Recommended Video

    Vijay Devarakonda Tops Most Desirable Man 2019 | Ram Charan | Prabhas
    సినిమాలా? ప్రభాసా..?

    సినిమాలా? ప్రభాసా..?

    సినిమాలో నటించే అవకాశాన్ని వదులుకుంటావా? ప్రభాస్‌తో స్నేహం వదులుకుంటావా? అని అనుష్కకు కష్టతరమైన ప్రశ్నను సంధించింది. అయితే ఇలాంటి ప్రశ్నకు కూడా ఏమాత్రం తడుముకోకుండా స్వీటీ జవాబు చెప్పేసింది. సినిమాలే వదిలేస్తా.. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభాస్ స్నేహాన్ని వదిలిపెట్టలేనని, వారి మధ్య ఉన్న బంధం గురించి అసలు నిజం చెప్పేసింది.

    English summary
    Anushka Shetty About Prabhas In Cash Show. She Says That Even Movie Also Gave uP But Prabahs Friendship Wil Never Gave up.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X