అతన్నే పెళ్లాడతా..! క్రికెటర్‌తో డేటింగ్‌పై క్లారిటీ ఇచ్చిన అనుష్క..

గత కొన్నేళ్లుగా అనుష్క పెళ్లి మ్యాటర్ మీడియాలో హైలైట్ అవుతూనే వస్తోంది. టాలీవుడ్ టాప్ హీరోయిన్ పైగా హీరోయిన్లలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కావడంతో అందరి కళ్ళు ఆమె పెళ్లి పైనే పడ్డాయి. ఈ నేపథ్యంలో ఆమె పెళ్ళికి సంబంధించి రకరకాల వార్తలు షికారు చేశాయి. తాజాగా ఇలాంటి వార్తలపై రియాక్ట్ అవుతూ తన పెళ్లి మ్యాటర్ గురించి స్పందించింది అనుష్క. వివరాల్లోకి పోతే..

Recommended Video

Anushka Shetty Open Up On Dating A Cricketer | Filmibeat Telugu
అనుష్క పెళ్లి మ్యాటర్.. టీమిండియా క్రికెటర్‌తో!

అనుష్క పెళ్లి మ్యాటర్.. టీమిండియా క్రికెటర్‌తో!

ఎప్పటినుంచో అనుష్క పెళ్లి మ్యాటర్ జనాల నోళ్ళలో నానుతూ వస్తున్నప్పటికీ ఇటీవలే వచ్చిన ఓ వార్త మరింత చర్చనీయాంశంగా మారింది. టీమిండియా క్రికెటర్‌తో అనుష్క పెళ్లి జరగబోతుందనే కొత్త ప్రచారం వెలుగులోకి రావడం ఆసక్తికరంగా మారింది. ఉత్తరాదికి చెందిన ఓ ఆటగాడితో అనుష్క ఏడడుగులు వేయనుందనే వార్తలు సోషల్ మీడియాలో తెగ షికారు చేస్తుండటం చూసి తన రియాక్షన్ తెలిపింది అనుష్క.

క్రికెటర్‌తో డేటింగ్.. అనుష్క రియాక్షన్

క్రికెటర్‌తో డేటింగ్.. అనుష్క రియాక్షన్

''మొన్నటిదాకా నేను ఎవరితోనో లవ్‌లో ఉన్నాను అని రాసేసారు. ఇప్పుడు పెళ్లి కుదరింది అని రాస్తున్నారు. నేను ఏ క్రికెటర్‌తోనూ డేటింగ్‌లో లేను. ఇలాంటి రూమర్స్ రాసేముందు కాస్త క్రాస్ చెక్ చేసుకొని రాస్తే మంచిది'' అని అనుష్క తన కాస్త ఘాటుగానే స్పందించింది.

 ఈ మీడియా దయవల్ల ఇప్పటికే..

ఈ మీడియా దయవల్ల ఇప్పటికే..

''నా ప్రేమ, పెళ్లికి సంబంధించిన రూమర్స్ రోజు రోజుకూ రెట్టింపవుతూ వస్తున్నాయి. ఈ మీడియా దయవల్ల ఇప్పటికే నాకు ఎన్నోసార్లు పెళ్లై పోయిందని అనుష్క అంటోంది. నా పెళ్లి సంగతి తల్లిదండ్రులకే అప్పగించాను. వాళ్ళు ఎవర్ని పెళ్లి చేసుకోమంటే అతన్నే పెళ్లాడతా. దయచేసి ఈ రూమర్స్ ఆపేయండి'' అని అనుష్క తెలిపింది.

ప్రభాస్- అనుష్క రిలేషన్

ప్రభాస్- అనుష్క రిలేషన్

ఇప్పటికే ప్రభాస్‌తో అనుష్క రిలేషన్ మెయిన్‌టైన్ చేస్తుందనే వార్తలు విన్నాం. ఆ ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ రూమర్స్ ఓ రేంజ్‌లో హల్చల్ చేశాయి. అయితే ఈ వార్తలపై అటు అనుష్క, ఇటు ప్రభాస్ క్లారిటీ ఇచ్చేయడంతో వాటికి ఫుల్‌స్టాప్ పడింది.

అనుష్క నిశ్శబ్దం.. ప్రేక్షకుల వెయిటింగ్

అనుష్క నిశ్శబ్దం.. ప్రేక్షకుల వెయిటింగ్

ఇకపోతే ‘భాగమతి' సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న అనుష్క.. తిరిగి కెమెరా ముందుకొచ్చింది. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘నిశ్శబ్దం' సినిమాలో ప్రస్తుతం అనుష్క నటిస్తోంది. ఇందులో మాధవన్ హీరోగా నటించగా.. అంజలి, సుబ్బరాజు, షాలిని పాండే, శ్రీనివాస్ అవసరాలతో తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా కోసం ప్రేక్షకలోకం ఈగర్‌గా వెయిట్ చేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X