నిశ్శబ్దం తర్వాత అనుష్క.. తదుపరి సినిమాపై స్వీటీ క్లారిటీ
'భాగమతి' సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న అనుష్క.. తిరిగి కెమెరా ముందుకొచ్చింది. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో రూపొందుతున్న 'నిశ్శబ్దం' సినిమాలో లీడ్ రోల్ పోషించింది. టీజీ విశ్వప్రసాద్, హేమంత్ మధుకర్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్న ఈ సినిమాలో మాధవన్, షాలిని పాండే, అంజలి, సుబ్బరాజు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.
తెలుగుతో పాటు హిందీ భాషలోనూ విడుదల కాబోతున్న ఈ నిశ్శబ్దం సినిమాను ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ప్రకటించారు. అయితే కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న కారణంగా సినిమా విడుదల గురించి సందిగ్ధత నెలకొంది. ఇదిలా ఉండగానే అనుష్క తదుపరి సినిమా విషయమై జనాల్లో ఆత్రుత నెలకొంది. ఈ మేరకు పలు వార్తలు కూడా పుట్టుకొచ్చాయి.

అయితే తాజాగా అనుష్క శెట్టి ఈ విషయమై క్లారిటీ ఇచ్చింది. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్లు తెలియజేసింది. ఇది కాకుండా మరో రెండు సినిమాల కోసం చర్చలు జరుపుతుందట స్వీటీ. మరోవైపు అనుష్క పెళ్లి మ్యాటర్ జనాల్లో హాట్ ఇష్యూగా మారింది.
అయితే ఈ విషయమై స్పందించిన అనుష్క.. నా ప్రేమ, పెళ్లికి సంబంధించిన రూమర్స్ రోజు రోజుకూ రెట్టింపవుతూ వస్తున్నాయి. దీనిపై స్పందించిన స్వీటీ.. ఈ మీడియా దయవల్ల ఇప్పటికే నాకు ఎన్నోసార్లు పెళ్లై పోయిందని, దయచేసి అలాంటి రూమర్స్ ఆపండని పేర్కొంది.


Click it and Unblock the Notifications











