Don't Miss!
- News ఐటీ హబ్ లో హైఅలర్ట్, దెబ్బకు అన్ని కంపెనీలకు సెలవు, ఓటు సరే పెళ్లామ్ తో జంప్!
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Sports SRH vs RCB: అందుకే వాషింగ్టన్ సుందర్‌పై వేటు వేసాం: ప్యాట్ కమిన్స్
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మాజీ అండర్ వరల్డ్ డాన్ మృతి.. తట్టుకోలేకపోయిన అనుష్క శెట్టి ఫ్యామిలీ!
బాహుబలి కథానాయిక అనుష్క శెట్టి ఫ్యామిలీ ఒక విషాద ఘటనతో తీవ్ర మనోవేదనకు గురైనట్లు తెలుస్తోంది. హఠాత్తుగా మాజీ అండర్ వరల్డ్ డాన్ మృతి చెందడంతో ఆ వార్త మీడియాలో హాట్ టాపిక్ గా మరగా విషయం తెలుసుకున్న అనుష్క కుటుంబ సభ్యులు విషాదంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇంతకి ఒక మాజీ డాన్ తో అనుష్కకి సంబంధం ఏంటి అనే సందేహాలు వెలువడుతున్నాయి.. వివరాల్లోకి వెళితే..
దేశాల్ని వణికించిన డాన్..
కర్ణాటకకు చెందిన 68 ఏళ్ల ముతప్ప రాయ్ అంటే ఒకప్పుడు కొన్ని దేశాలు వణికిన సందర్భాలు ఉన్నాయి. 30ఏళ్ల వరకు బెంగుళూరు వేదికగా తన అండర్ వరల్డ్ సామ్రాజ్యాన్ని నడిపించాడు. ఒక బ్యాంక్ ఉద్యోగి నుంచి అండర్ వరల్డ్ డాన్ వరకు ఎదిగిన ముతప్ప రాయ్ ను పట్టుకోవడానికి ఇండియన్ పోలీసులు ఎన్నో సార్లు ప్రయత్నించారు.
చివరికి..
ముతప్ప రాయ్ చివరికి దుబాయ్ లో ఉన్నట్లు తెలుసుకున్న భారత అధికారులు అతన్ని కస్టడీలోకి తీసుకున్నారు. అనంతరం క్రైమ్ వ్యవహారాలకు దూరమైన ముతప్ప రాయ్ కర్ణాటక అనే ఆర్గనైజేషన్‌ను ఏర్పాటు చేసి పేద ప్రజలకు సహాయం చేయడం స్టార్ట్ చేశాడు. సోషల్ యాక్టివిస్ట్ గా మారిన అతను పోలీసులకు చాలా విషయాల్లో సహకరించాడని టాక్ వచ్చింది.
హఠాత్తుగా..
68సంవత్సరాల ముతప్ప రాయ్ ఇటీవల కన్నుమూశారు. బ్రెయిన్ క్యాన్సర్ తో బాధపడుతున్న ఈ మాజీ డాన్ బెంగుళూరులోని ఒక ప్రయివేటు ఆస్పత్రిలో చిక్కిత్స అందుకుంటూ తన తుది శాస్వ విడిచినట్లు సన్నిహితులు తెలిపారు. ముతప్ప మరణంతో ఆయన నుంచి సహాయం పొందినవారు తీవ్ర విషాదంలోకి వెళ్లారు.
అనుష్కతో డాన్?
అనుష్క శెట్టికి ఒక మాజీ డాన్ కి సంబంధం ఏంటి అనే విషయంలోకి వెళితే.. ముతప్ప సోషల్ యాక్టివిస్ట్ గా మారిన తరువాత అనుష్క కుటుంబానికి సన్నిహితంగా ఉంటున్నారట. అంతే కాకుండా అనుష్క ఫ్యామిలీకి ముతప్ప దగ్గరి బంధువు అని కూడా కథనాలు వెలువడుతున్నాయి. బాహుబలి రిలీజ్ అనంతరం అనుష్క వివిధ దేశాల్లో ఆలయ సందర్శనాలకు వెళ్లగా అప్పుడు ముతప్ప కూడా ఆమె వెంటే ఉన్నారు.
Recommended Video
రామ్ గోపాల్ వర్మ రాయ్..
ముతప్ప జీవిత ఆధారంగా రామ్ గోపాల్ వర్మ గతంలో ఒక సినిమాను ఎనౌన్స్ చేశాడు. రాయ్ అనే టైటిల్ తో వివేక్ ఒబేరాయ్ ముతప్ప పాత్రలో కనిపించనున్నట్లు పోస్టర్ కూడా వదిలారు. కానీ ఎందుకో ఆ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లలేదు. ఇక ముతప్ప చనిపోతారనే విషయం ఆయనకు ముందే తెలుసు. గతంలోనే ఆయన ఒక ప్రెస్ మీట్ లో తనకు బ్రెయిన్ క్యాన్సర్ కారణంగా ఐదేళ్లకు మించి బ్రతకనని చెప్పారు.