Chiru157: చిరంజీవికి స్టార్ హీరోయిన్ ఫిక్స్.. తొలిసారి ఆమెతో బాస్ రొమాన్స్

తెలుగు చిత్ర పరిశ్రమలో వేగంగా సినిమాలు చేస్తున్న బడా హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. ముఖ్యంగా రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయన జెట్ స్పీడుతో దూసుకుపోతోన్నారు. ఇలా ఇప్పటికే చాలా చిత్రాలను ఆడియెన్స్‌కు అందించి అలరించారు. ఈ క్రమంలోనే ఇటీవలే చిరంజీవి 'భోళా శంకర్' మూవీతో వచ్చారు. ఈ చిత్రం మాత్రం భారీ నష్టాలతో డిజాస్టర్‌గా మిగిలిపోయింది.

వేగంగా సినిమాలను లైన్‌లో పెట్టే మెగాస్టార్ చిరంజీవి.. ఇప్పటికే 'బంగార్రాజు' డైరెక్టర్ కల్యాణ్ కృష్ణ కురసాలతో ఓ ప్రాజెక్టుకు సిగ్నల్ ఇచ్చారు. దీన్ని మెగా డాటర్ సుస్మిత కొణిదెల నిర్మించబోతోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అయితే, దీన్ని కొంత కాలం ఆపేయాలని ఆయన డిసైడ్ అయినట్లు టాక్ వినిపిస్తోంది.

Chiru157

మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే తన 157వ సినిమాను కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. దీన్ని 'బింబిసార' ఫేం మల్లిడి వశిష్ట తెరకెక్కిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా కాన్సెప్టు పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఇందులో పంచ భూతాలను చూపించి ఆసక్తిని పెంచేశారు.

మల్లిడి వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి చేయబోయే సినిమా.. 'జగదేక వీరుడు అతిలోక సుందరి' మాదిరిగా ఉండబోతుందని తెలిసింది. అంతేకాదు, మానవుడైన హీరో పలు లోకాలను చుట్టి వచ్చేలా వరం పొందుతాడట. ఆయా లోకాల్లో అతడికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అనే కథాంశంతోనే ఈ సినిమా తెరకెక్కబోతుందని ఇటీవలే ఓ న్యూస్ లీకైంది.

క్రేజీ కాంబోలో రూపొందుతోన్న ఈ మూవీలో చిరంజీవి సరసన ఏకంగా ఎనిమిది మంది హీరోయిన్లు నటించే అవకాశం ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఇందులో ఒకరు మెయిన్ హీరోయిన్ కాగా.. మిగిలిన వాళ్లు కీలక పాత్రలు చేస్తారని అంటున్నారు. ఇక, తాజాగా మెయిల్ లీడ్‌గా అనుష్క శెట్టిని ఫిక్స్ చేశారని తెలిసింది. దీంతో ఆమెతో తొలిసారి బాస్ జట కట్టబోతున్నట్లు అయింది.

Anushka Shetty

ఇదిలా ఉండగా.. హీరో పాత్ర మూడు లోకాలను చుట్టి వచ్చేలా డిజైన్ చేయబట్లే ఈ చిత్రానికి 'ముల్లోక వీరుడు' అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారని కూడా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా అతి త్వరలోనే ప్రారంభం కాబోతుందట. దీన్ని వచ్చే ఏడాది రిలీజ్ చేసేలా ప్లాన్ చేసినట్లు కూడా టాక్ వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X