Anushka Shetty చేతుల మీదుగా 'కల్యాణం కమనీయం'.. సంక్రాంతి బరిలో సంతోష్ శోభన్!

పేపర్ బాయ్, ఏక్ మినీ కథ, మంచి రోజులొచ్చాయ్, ది బేకర్ అండ్ ది బ్యూటి వంటి విభిన్నమైన లవ్ స్టోరీస్ తో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న యంగ్ హీరో సంతోష్ శోభన్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇటీవలే జాతి రత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లాతో జోడి కట్టి Like, Share & Subscribe సినిమాతో పర్వాలేదనిపించుకున్న ఈ హీరో తాజాగా మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. కల్యాణం కమనీయం అంటూ ఈ సంక్రాంతికి సందడి చేయనున్న ఈ సినిమా ట్రైలర్ ను స్టార్ హీరోయిన్ అనుష్క విడుదల చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..

కొత్తదనం చూపించే ప్రయత్నం..

కొత్తదనం చూపించే ప్రయత్నం..

విభిన్నమైన కథలతో కాన్సెప్ట్ ఒరియెంటెడ్ చిత్రాలతో ఆకట్టుకునే యంగ్ హీరో సంతోష్ శోభన్. ప్రముఖ దర్శకుడు శోభన్ (ప్రభాస్ వర్షం మూవీ డైరెక్టర్) కుమారుడిగా సినిమాల్లోకి వచ్చిన తనదైన ముద్ర వేసుకుని మంచి నటుడిగా పేరు సంపాదించుకున్నాడు. ఇప్పటివరకు సంతోష్ శోభన్ చేసినవి లవ్ స్టోరిస్ అయినప్పటికీ అందులో కొత్తదనం చూపించే ప్రయత్నం చేశాడు ఈ హీరో. ఇటీవలే Like, Share & Subscribe సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంతోష్ శోభన్ వెను వెంటనే కల్యాణం కమనీయం అంటూ సందడి చేయనున్నాడు.

 ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా..

ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా..

యూవీ క్రియేషన్ బ్యానర్ లో సంతోష్ శోభన్ నటించిన చిత్రం మంచి రోజులు వచ్చాయి. ఇప్పుడు అదే బ్యానర్ లో కల్యాణం కమనీయం అంటూ రోండో సినిమాగా వస్తున్నాడు సంతోష్ శోభన్. ఈ సినిమాతో అనిల్ కుమార్ ఆళ్ల దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి హో ఎగిరే, ఓ మనసా వంటి పాటలు విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.

 ఉద్యోగం చేసే ఆలోచన ఉందా..

ఉద్యోగం చేసే ఆలోచన ఉందా..

ఇప్పుడు తాజాగా కల్యాణం కమనీయం సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ సినిమా ట్రైలర్ ను స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి రిలీజ్ చేశారు. ఒక నిమిషం 51 సెకన్ల పాటు సాగిన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. ట్రైలర్ ప్రారంభంలో పెళ్లి సన్నివేశాలతోతో అందంగా చూపించారు. హీరోయిన్ ను హీరో పెళ్లి చేసుకుని ఏడు అడుగులు వేస్తున్న సీన్లు కనువిందుగా ఉన్నాయి. తర్వాత ఉద్యోగం చేసే భార్య.. అవసరాలు తీర్చే మామ అంటూ కొడుకుతో తండ్రి చెప్పే డైలాగ్ నవ్వు తెప్పించేలా ఉంది. ఎప్పుడు ఇవే పనులా, ఉద్యోగం చేసే ఆలోచన ఉందా, తర్వాత మచ్చ వేసుకుని పుట్టానేమో, ఉండాల్సింది మచ్చ కాదు సుడి వంటి డైలాగ్ లు ఆకట్టుకున్నాయి.

 నాన్నపై పడి పాతికేళ్లు బతికేసావ్..

నాన్నపై పడి పాతికేళ్లు బతికేసావ్..

శివకు ఉద్యోగం లేకపోయినా పర్వాలేదేమో.. కానీ శ్రుతి భర్తకు ఉద్యోగం ఉండాలి అంటూ ట్విస్ట్ ఇచ్చారు. అయితే సాఫ్ట్ వేర్ ఎంప్లాయిగా జాయిన్ అయ్యానని చెప్పి హీరో క్యాబ్ డ్రైవర్ గా చేస్తాడని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. జాబ్ వస్తే ఇంట్లో వాళ్లు ఇచ్చే విలువ వేరురా.. జాబ్ తెచ్చుకో, పాతికేళ్లు మీ నాన్నపై పడి బతికేసావ్.. ఇప్పుడు నాపై పడి బతికేద్దామని ప్లాన్ వేశావ్ అది జరగదు అంటూ తదితర డైలాగ్ లు ఆకట్టుకునేలా ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X