అనుష్క, నవీన్ పోలిశెట్టి టైటిల్ వచ్చేసింది.. అలాంటి పాత్రల్లో డిఫరెంట్ కామెడీ.. రిలీజ్ ఎప్పుడంటే?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి వెండితెరకు గ్యాప్ ఇచ్చి చాలా కాలమైంది. ఆమె చివరగా లీడ్ పాత్రలో నటించిన భాగమతి థియేటర్లలో విడుదల అయింది. ఇక తర్వాత మళ్ళీ నిశ్శబ్దం సినిమా చేసినప్పటికీ అది ఓటీటీ లోనే డైరెక్ట్ గా విడుదలైంది ఇక ఇన్నాళ్లకు ఆమె మళ్ళీ నవీన్ పోలిశెట్టితో ఒక కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ కూడా విడుదల చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..

పాజిటివ్ వైబ్రేషన్స్
బాహుబలి 2 ద్వారా ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు అందుకున్న అనుష్క అలాగే జాతి రత్నాలు సినిమాతో మంచి క్రేజ్ అందుకున్న యువ హీరో నవీన్ పోలిశెట్టి కలిసి నటించిన చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ టైటిల్ కూడా విడుదల చేశారు. వీరి కాంబినేషన్లో సినిమా వస్తోంది అనగానే మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అయ్యాయి.

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి
ఇక సినిమాకు సంబంధించిన టైటిల్ ఎప్పుడు విడుదలా చేస్తారా అని ఓవర్గం ఫ్యాన్స్ అయితే ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఆ అంచనాలకు అందుకునే విధంగానే ఇప్పుడు ఫస్ట్ లుక్ టైటిల్ ని కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ సినిమాకు కథకు తగ్గట్టుగా ఆకట్టుకునేలా 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' అనే టైటిల్ ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది.

అలాంటి పాత్రల్లో..
సినిమా టైటిల్ చాలా క్యాచీగా ఉండడంతో సోషల్ మీడియాలో నిమిషాల్లోనే వైరల్ గా మారిపోయింది. ఈ టైటిల్ అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చడంతో అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంటుంది. ఇక ఈ సినిమాలో నవీన్ పాత్ర, సిద్ధు పోలీశెట్టి ఒక స్టాండప్ కమెడియన్ గా ఉండబోతుందట. అనుష్క అన్విత రవళి శెట్టి అనే చెఫ్ పాత్రలో కనిపించబోతోంది. ఈ సినిమాకు యువ దర్శకుడు మహేష్ బాబు దర్శకత్వం వహించగా UV క్రియేషన్స్ నిర్మిస్తోంది.

ఆకట్టుకునే విధంగా..
ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. భాగమతి సినిమాతో బాక్సాఫీస్ ని షేక్ చేసిన అనుష్క మళ్ళీ ఇన్నాళ్లకు మరో ఆసక్తికరమైన సినిమాతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడానికి సిద్ధమవుతోంది. మిస్టర్ పోలిశెట్టి సినిమా అన్ని వర్గాల్లో ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా దర్శకుడు మీ మహేష్ బాబు తెరపైకి తీసుకువస్తున్నట్లు సమాచారం.

రిలీజ్ ఎప్పుడంటే..
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాలో అనుష్క విభిన్నమైన పాత్రతో ఆకట్టుకోబోతోందట. ఇక నవీన్ కూడా ఇప్పటివరకు ఎలాంటి సినిమా చేసిన కూడా తన కామెడీతో చాలా మెప్పించాడు. ఇక ఈ సినిమా కూడా అందుకు తగ్గట్టుగానే మంచి కామెడీగా ఉంటుందట. ఇక ఈ సినిమాను తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషలో సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమాకు రథన్ సంగీతం అందిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











