twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నిశ్శబ్దం ట్రైలర్: థ్రిల్లింగ్‌గా అనుష్క శెట్టి.. అంచనాలు పెంచిన మాధవన్, అంజలి

    |

    బాహుబలి అనంతరం హీరోల మాదిరిగానే అనుష్క కూడా చాలా నెమ్మదిగా సినిమాలు చేసుకుంటూ వెళుతోంది. ఇక ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న నిశ్శబ్దం సినిమా రిలీజ్ డేట్ పై కూడా క్లారిటీ ఇచ్చేశారు. త్వరలో ఆమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కానున్న ఈ సినిమా ట్రైలర్ ని కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేశారు. ఇక అనుష్క తనదైన శైలిలో డిఫరెంట్ టాలెంట్ తో సరికొత్తగా ఆకట్టుకుంది.

    థ్రిల్ కి గురి చేస్తున్న నిశ్శబ్దం ట్రైలర్

    థ్రిల్ కి గురి చేస్తున్న నిశ్శబ్దం ట్రైలర్

    అరుంధతి, భాగమతి వంటి సినిమాలతో ఇదివరకే కొన్నిసార్లు ఆడియెన్స్ కి సరికొత్త కిక్కిచ్చిన స్వీటీ అనుష్క ఈ సారి అంతకుమించిన రెంజ్ లో థ్రిల్ చేయాలని చూస్తోంది. ఏకంగా హాలీవుడ్ రేంజ్ లో ఒక సస్పెన్స్ తో కూడిన నిశ్శబ్దం అనే హారర్ కథను ఎంచుకుంది. చూస్తుంటే మర్డర్ మిస్టరీతో పాటు ఒక గోస్ట్ హంటింగ్ తరహాలో ఉందని అర్ధమవుతోంది.

     ఆమె దెయ్యంగా మారుతుందా?

    ఆమె దెయ్యంగా మారుతుందా?

    పెయింటింగ్ ని ఎక్కువగా ఇష్టపడే సాక్షికి (అనుష్క) సోనాలి అనే ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటుంది. అయితే ఆమె అజ్ఞాతంగా ఉండి ఎదో క్రైమ్ కి పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఆమె వెనుక ఉన్న మర్మం ఏమిటి? ఆమె నిజంగా దెయ్యంగా మారిందా? అనుష్కను కూడా ఎందుకు టార్గెట్ చేస్తోంది? అనే రకరకాల ప్రశ్నలు ట్రైలర్ లో హైలెట్ చేశారు.

    సినిమాలో స్పెషల్ రోల్స్

    సినిమాలో స్పెషల్ రోల్స్

    ఇక సినిమాలో మాధవన్ కూడా ఒక స్పెషల్ పాత్రలో కనిపిస్తున్నాడు. అంజలీ స్పెషల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తోంది. హాలీవుడ్ యాక్టర్ మైకేల్ మాడ్సన్ కూడా ఒక ఇన్వెస్టిగేట్ ఆఫీసర్ గా సీరియస్ లుక్ లో కనిపిస్తున్నాడు. చూస్తుంటే అనుష్క మరోసారి ఊహించని విధంగా థ్రిల్ కి గురి చేసేలా ఉందని అనిపిస్తోంది.

     అక్టోబర్ 2న గ్రాండ్ రిలీజ్

    అక్టోబర్ 2న గ్రాండ్ రిలీజ్

    ఓటీటీ రైట్స్ అనే కాకుండా శాటిలైట్ రైట్స్ కూడా మిగిలి ఉన్నాయి కాబట్టి చిత్ర నిర్మాతలు మరింత లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఇక ఫైనల్ గా అక్టోబర్ 2న తెలుగులోనే కాకుండా కన్నడ, హిందీ, తమిళ్, మలయాళ భాషల్లో సినిమాను ఒకేసారి విడుదల చేయనున్నారు. ఈ మధ్య కాలంలో ఓటీటీలో వచ్చిన కొత్త సినిమాలు పెద్దగా సంతృప్తి పరచలేకపోయాయి. మరి అనుష్క ఎంతవరకు కిక్కిస్తుందో చూడాలి.

    ఓటీటీ డీలింగ్ తో అనుష్క రికార్డ్

    ఓటీటీ డీలింగ్ తో అనుష్క రికార్డ్

    గత రెండు నెలల నుంచి నిశ్శబ్దం చిత్ర నిర్మాతలు అమెజాన్ ప్రైమ్ డీలింగ్స్ పై చర్చలు జరుపుతున్నారు. ఇక ఫైనల్ గా 20కోట్లకు పైగా ఓటీటీ రైట్స్ ని అమ్మినట్లు తెలుస్తోంది. ఈ రేటుతో చిత్ర నిర్మాతలు సంతృప్తి చెందినట్లు సమాచారం. అనుష్క కెరీర్ లో ఇదొక సరికొత్త రికార్డ్ అనే చెప్పాలి.

    English summary
    The post-production work is yet to be postponed due to release in February in four languages. Due to Corona Lockdown, the theater closes for another two months and should not wait. It is not known what the conditions will be even after two months. That is why there was talk of Chance releasing the film on Digital World.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X