చిట్టితెరపై మనసు పడ్డ అనుష్కశెట్టి.. మనసానమ: అంటూ
వెండితెర మీద మహారాణిలా వెలిగిపోతున్న అందాల భామ అనుష్క షార్ట్‌ఫిలింపై మనసు పారేసుకొన్నారు. తాజాగా దీపక్ రెడ్డి అనే యువ దర్శకుడు రూపొందించిన మనసానమ: అనే షార్ట్ ఫిలింను ఆవిష్కరించారు. ప్రేమ జంటల కథలను ఈ షార్ట్ ఫిలిం ద్వారా ఆవిష్కరించారు.
మనసానమ: షార్ట్ ఫిలింను ఆవిష్కరించిన తర్వాత అనుష్కశెట్టి మాట్లాడుతూ.. లవ్లీగా దర్శకుడు ప్రజెంట్ చేశాడడు. దీపక్ అద్భుతంగా కథ చెప్పారు. దర్శకుడి టేకింగ్ నన్ను విశేషంగా ఆకట్టుకొన్నది అని అనుష్క చెప్పారు.

హీరోయిన్లగా కీలక పాత్రల్లో కనిపించిన ద్రిషికాపై ప్రశంసల కురిపించింది. ద్రిషిక అద్బుతంగా పెర్ఫ్మార్మ్ చేసింది. ప్రేక్షకులు ఆకట్టుకోవడం గ్యారెంటి. మనసానమ: యూనిట్‌కు అభినందనలు. తప్పుకుండా ఈ షార్ట్ ఫిలింను చూడంటి అంటూ తన సోషల్ మీడియాలో అకౌంట్‌లో పేర్కొన్నారు.
ఇక భాగమతి తర్వాత చాలా గ్యాప్ తీసుకొని నిశ్శబ్దం అనే చిత్రంలో నటించారు. ఈ చిత్రానికి హేమంత్ మధుకర్ దర్శకుడు. ఈ చిత్రంలో మాధవన్ భార్యగా అనుష్క శెట్టి నటించారు. థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ 4 రిలీజ్ కావాల్సింది. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. లాక్ డౌన్ తర్వాత ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











