twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అనుష్క సీక్రెట్స్.. పుస్తకం వచ్చేసింది.. మార్కెట్‌లో లభ్యం

    |

    దాదాపు పదిహేనేళ్ల క్రిందట పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'సూపర్' సినిమాతో తెలుగు తెరపై కాలుమోపిన స్వీటీ అనుష్క ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. వరుస అవకాశాలతో 14 ఏళ్లుగా సౌత్ సినిమా ఇండస్ట్రీని ఏలుతోంది. రోజుకో కొత్త హీరోయిన్ ఆరంగ్రేటం చేస్తున్న నేటి తరుణంలో కూడా అవకాశాలను అందిపుచ్చుకుంటోంది అనుష్క. సొంత అభిమానం వర్గమనేది స్టార్ హీరోలకు మాత్రమే సొంతం కాదు.. హీరోయిన్స్‌కి కూడా మంచి ఫాలోయింగ్‌తో పాటు ప్రత్యేక అభిమాన వర్గాలు ఉంటాయని ప్రూవ్ చేసిందీ భామ. అయితే ఇదంతా కేవలం ఆమె అందం, తెరపై చూపిన అభినయంతో వచ్చిన క్రేజ్ మాత్రమే.

    తగ్గటం కష్టమే అనుకున్నారు

    తగ్గటం కష్టమే అనుకున్నారు

    బాహుబలి సిరీస్‌తో ఏకంగా వరల్డ్ స్టార్‌గా మారిన ఈమె.. ఆ మధ్యలో వచ్చిన 'సైజ్ జీరో' సినిమా కోసం దాదాపు 20 కేజీల బరువు పెరిగి బొద్దుగా కనిపించి ఆశ్చర్య పర్చింది. క్యారెక్టర్ కోసం ఇంతలా బరువు పెరిగిన అనుష్క ఇక తగ్గటం కష్టమే అని భావించారంతా. కానీ క్రమంగా బరువు తగ్గి కుర్ర హీరోయిన్లు అసూయ పడే అందాన్ని తిరిగి సంపాదించుకుంది. నాజూకు నడుముతో ఇప్పుడు అనుష్క దిగిన పిక్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

    అనుష్క ఫిట్‌నెస్ సీక్రెట్.. మార్కెట్‌లో

    అనుష్క ఫిట్‌నెస్ సీక్రెట్.. మార్కెట్‌లో

    దీంతో అనుష్క ఫిట్‌నెస్ సీక్రెట్ ఏంటా ? అనే కోణంలో చర్చలు మొదలయ్యాయి. కానీ ఎవ్వరికీ అంతుచిక్కలేదు. చివరకు తానే ఆ సీక్రెట్ చెప్పడానికి రెడీ అయింది స్వీటీ అనుష్క. ‘ది మాజిక్ వెయిట్ లాస్ పిల్' అనే పుస్తకంలో తన ఫిట్‌నెస్ సీక్రెట్స్ ప్రచురించింది అనుష్క. ల్యూక్ కుతిన్హో రచనలో రాబోతున్న ఈ పుస్తకంలో 62 రకాల హెల్త్ టిప్స్, వెయిట్ లాస్ టెక్నిక్స్ ఉంటాయి. తాను బరువు తగ్గిన విధానాన్ని ఇందులో వివరించింది అనుష్క. ప్రస్తుతం ఈ పుస్తకం మార్కెట్‌లో లభ్యమవుతోంది.

    బరువు తగ్గేందుకే గ్యాప్

    బరువు తగ్గేందుకే గ్యాప్

    బాహుబలి, భాగమతి సినిమాల తర్వాత కొంతకాలం అనుష్క వెండితెరకు దూరంగా ఉంది. ఈ మధ్యకాలంలో ఆమెకు పెళ్లి సంబంధాలు చూశారని, ప్రభాస్ తో పెళ్ళికి సిద్ధమైందని రకరకాల వార్తలు పుట్టుకొచ్చాయి. కానీ చివరకు ఆమె బరువు తగ్గేందుకు ఈ గ్యాప్ తీసుకుందని కన్ఫర్మ్ అయింది.

    అనుష్క శెట్టి సినిమాలు

    అనుష్క శెట్టి సినిమాలు

    ఇక అనుష్క సినిమాల విషయానికొస్తే.. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'సైలెన్స్' అనే డిఫెరెంట్ మూవీలో లీడ్ రోల్ పోషిస్తోంది. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌ పై రూపొందుతున్న ఈ సినిమాలో మాధవన్, షాలినీ పాండే, సుబ్బరాజు తదితరులు నటిస్తున్నారు.

    English summary
    Anushka reveals her weight loss secrets in a book. The book titled 'The Magic Weight Loss Pill' with Anushka. This book is available in the market now.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X